టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఆమె అంతర్జాతీయ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు సానియా మళ్లీ వింబుల్డన్ కోర్టులో పోటీకి రెడీ అయ్యింది. అయితే ప్రధాన వింబుల్డన్ డ్రాలో మాత్రం సానియా మీర్జా పోటీ చేయడం లేదు. లేడీస్ లెజెండ్స్ ఇన్విటేషన్ డబుల్స్‌లో సానియా పోటీపడనుందని తెలుస్తుంది..గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోహన్నా కొంటాతో సానియా భాగస్వామి కానుందని సమాచారం.. 32 ఏళ్ల జోహన్నా కొంటా గ్రేట్ బ్రిటన్ తరఫున ఆడడానికి ముందు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించింది. కానీ 2021 ఎడిషన్ చివరిలో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది..వీరిద్దరూ కూడా ఈ సంవత్సరం వింబుల్డన్‌కు హాజరవుతారని సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పష్టం చేసారు.
టోర్నీ షెడ్యూల్‌ను సానియా మీర్జా తండ్రి ట్విట్టర్‌లో షేర్ చేసారు.. ఈ టోర్నమెంట్‌లో సానియా మీర్జా మాజీ డబుల్స్ భాగస్వామి మార్టినా హింగిస్ మరియు నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఛాంపియన్ అయిన కిమ్ క్లిజ్‌స్టర్స్ సహా కొంతమంది రిటైర్డ్ స్టార్ ప్లేయర్ లతో పోటీ పడనుంది.వింబుల్డన్ 2023 మెయిన్ డ్రాలో ప్రవేశించిన ఏకైక భారతీయుడు రోహన్ బోపన్న.43 ఏళ్ల బోపన్న ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో ఆయన తలపడనున్నాడు. జూలై 5న జరిగే పురుషుల డబుల్స్ ఈవెంట్ తొలి రౌండ్‌లో ఆస్ట్రేలియన్ ఆటగాడితో కలిసి అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో డురాన్ మరియు టోమస్ మార్టిన్ ఎట్చెవెరీతో తలపడనున్నారు.దీంతో వింబుల్డన్‌లో భారత టెన్నిస్ స్టార్ బోపన్న 13వ సారి ఆడనున్నట్లు సమాచారం.రోహన్ బోపన్న స్పందిస్తూ డేవిస్ కప్ నుంచి తాను రిటైర్మెంట్ తీసుకుంటానని, అయితే తన బాడీ సహకరించే వరకు ఏటీపి టూర్‌లో ఆడుతానని ఆయన ప్రకటించారు.వింబుల్డన్ 2023 ప్రధాన రౌండ్ మ్యాచ్‌లు జూలై 3 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు సంబంధించిన క్వాలిఫైయర్‌లు జూన్ 26న ప్రారంభమై జూన్ 29న ముగుస్తాయని తెలుస్తుంది.