అహ్మదాబాద్‌లో జరిగిన రిసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా (ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ) వార్షిక సమావేశంలో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ సీహెచ్ వసంత్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌డీఐ సొసైటీ ప్రజలకు మధుమేహంపై అవగాహన కల్పించడమే కాకుండా పరిశోధనలు నిర్వహిస్తుంటుంది.
ఈ సోసైటీలో వివిధ దేశాల నుంచి 9,400 మంది సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా డా.వసంత్ కుమార్ మాట్లాడుతూ.. “భారతదేశం అంతటా మరిన్ని పరిశోధనలు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మా సంస్థను దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాము” అని ఆయన అన్నారు.