ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలతో పాటు.. వంట గ్యాస్ ధరలకు బ్రేక్ పడింది.. అయితే, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో.. భారత్‌లో ఎప్పుడైనా పెట్రో, గ్యాస్ ధరలు పెరుగుతాయనే విశ్లేషణలు ఉన్నాయి. దానికి తోడు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో.. ఇక, త్వరలోనే వడ్డింపు అంటూ అనేక వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. చమురు సంస్తలు భారీ వడ్డింపునకు పూనుకున్నాయి.. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగిపోయాయి.. దాదాపు 5 నెలల తర్వాత ధరలను పెంచాయి చమురు సంస్థలు.. వంట గ్యాస్ సిలిండర్ ధరను కూడా భారీగా పెంచాయి.. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వడ్డించాయి. ఇక, పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించాయి.. దీంతో, తెలంగాణలో 14 కేజీల వంట గ్యాస్ ధర తొలిసారి వెయ్యి దాటేసి రూ.1002కు చేరింది… తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లో 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1008కి పెరిగింది. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడంతో గగ్గోలు పెడుతోన్న సామాన్యుడి నెత్తిన ఇప్పుడు గ్యాస్ బండిపడినట్టు అయ్యింది.
Read Also: Privatisation: ఐడీబీఐ ప్రైవేటీకరణ.. ఆసక్తిదారుల కోసం రోడ్‌షోలు..