Dog Temple In Up: వందేళ్లుగా శునకానికి పూజలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో మనుషులకు దైవ భక్తితో ఎక్కువ.. అందుకే వీధికి నాలుగు ఐదు ఆలయాలు ఉంటాయి.. అయితే దేవుళ్ళకు ఆలయాలు ఉండటం చూసే ఉంటారు.. కానీ ఓ కుక్కకు ఆలయం కట్టించి పూజలు చెయ్యడం ఎప్పుడైనా విన్నారా? ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం.. మనదేశంలో అలాంటి ఆలయం ఒకటి ఉంది.. ఎక్కడో కాదు.. ఉత్తర ప్రదేశ్ లోనే ఉంది.. ఈ మధ్య కట్టింది కాదు.. వందేళ్లుగా అక్కడ ఉంది. ఆ కుక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఆ గ్రామస్థులు.. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. ఒకసారి ఆ శునకం ఆలయం గురించి వివరంగా తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో ఉన్న సికందరాబాద్లో ఈ అరుదైన ఆలయం ఉంది. ఈ గుడిలో శునకం విగ్రహానికి పూజలు చేయడానికి ఒక బలమైన కారణం ఉందని భక్తులు విశ్వసిస్తారు..దాదాపు 100 ఏళ్ల కిందట సికందరాబాద్లో బాబా లటూరియా ఉండేవారట. ఆయన సొంతంగా ఒక దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఉంటూ.. ఇక కుక్కను బాబా లటూరియా పెంచుకునేవారు. ఆ కుక్కను.. ‘బైరో బాబా’గా పిలిచేవారు. ఓ రోజు బాబా లటూరియా తాను నిర్మించిన గుడిలోనే సజీవ సమాధి అయ్యేందుకు రెడీ అయ్యారట. ఈ సమయంలో బైరో బాబా(శునకం) కూడా సజీవ సమాధిలోకి దూకిందట..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆ కుక్కను సమాధి నుంచి బయటకు తీశారు.. ఆయన ఆ కుక్క అప్పటికే ప్రాణాలను కోల్పోయిందట.. ఆ తర్వాతే ఆలయంలో శునకానికి విగ్రహాన్ని నిర్మించారట. ప్రేమ, విధేయతలతో బాబా లటూరియా వెంట జీవితాంతం తిరిగిన శునకాన్ని నాటి నుంచే పూజించడం మొదలుపెట్టారు. ఈ కుక్క విగ్రహం పాదాలకు నల్ల దారం కట్టి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని స్థానిక భక్తులు నమ్ముతారు. ఇటువంటి విశిష్టత కారణంగా ఈ ఆలయానికి ‘బైరో దేవాలయం’ అనే పేరు వచ్చింది.. అలా ఆ ఆలయాన్ని సందర్శించడానికి దేశం నలుమూలల నుంచి జనాలు తరలి వస్తుంటారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!