హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్

సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్ లో కనికాను కలవండి” అంటూ మేకర్స్ ఈ చిత్రంలో ఆమె ‘కనికా’ అనే పాత్ర పోషిస్తున్నట్టు స్పష్టం చేశారు.

Read Also : హాట్ నెస్ తో చంపేస్తున్న అక్షర గౌడ… పిక్స్

ఇంతకుముందు ఈ చిత్రం నుంచి సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్ ల ఫస్ట్ లుక్స్ కూడా విడుదల చేశారు. అందులో సైఫ్ పాత్రకు విభూతి అని పేరు పెట్టగా, అర్జున్ చిరంజీ పాత్రలో నటించనున్నారు. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతలా థ్రిల్ చేస్తుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-