NTV Telugu Site icon

Supreme Court: అబార్షన్‌ కోసం వచ్చే మైనర్ల వివరాలు పోలీసులకు చెప్పనక్కర్లేదు..

Supreme Court

Supreme Court

Supreme Court: వివాహితులు, అవివాతులునే వివక్ష లేకుండా దేశంలోని మహిళలందరూ 24 వారాల్లో అబార్షన్‌ చేసుకోవచ్చంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. తాజాగా మైనర్ బాలికల విషయంలో కొన్ని కీలకాంశాలను స్పష్టం చేసింది. అబార్షన్‌ కోసం తమ వద్దకు వచ్చే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మెడికల్ టెర్మినేషన్‌ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎంటీపీ) చట్టపరిధిని మైనర్లకూ విస్తరిస్తూ వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్‌ చేసుకోవచ్చని పేర్కొంది. అంతేకాకుండా అందుకు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్‌ నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు బాలికలు ఇకపై న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది.

5G Services Launch: 5జీ సేవలకు నేడే శ్రీకారం.. అధికారికంగా ప్రారంభించనున్న ప్రధాని

బాలికల అబార్షన్‌కు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది. బాలికలు ఎవరైనా అబార్షన్ కోసం తమను ఆశ్రయించినప్పుడు ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఈ సెక్షన్ చెబుతుంది. లేదంటే దానిని నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం తీర్పులో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ సెక్షన్‌ నుంచి వైద్యులకు మినహాయింపిచ్చింది. మైనర్‌ లేదా మైనర్‌ సంరక్షకుడి విజ్ఞప్తి మేరకు గర్భవిచ్ఛిత్తి వివరాలను వైద్యులు గోప్యంగా ఉంచవచ్చని పేర్కొంది. అంతేకాదు, ఈ వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనికూడా లేదని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది.

Show comments