RG Kar EX-Principal: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. పాలీగ్రాఫ్ పరీక్షకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 9వ తేదీన వైద్యురాలి శరీరం సెమీనార్ హాల్‌లో పడి ఉంది.. ఈ ఘటన తర్వాత రెండు రోజులకు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేయడం.. ఇప్పటికే పలుసార్లు ఆయన.. సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యారు.
Read Also: Bangladesh: షేక్ హసీనాను తమకు అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లాదేశ్
అయితే, సందీప్ ఘోష్‌ను మరోసారి విచారణ చేయాలనుకుంటున్నామని, తమ ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాల్లో తేడా కనిపిస్తుంది.. అందుకే మరోసారి ఘోష్ ను పరీక్షించాలనుకుంటున్నామని.. అందులో భాగంగానే పాలీగ్రాఫ్ టెస్టు చేయాలనుకుంటున్నట్లు ఓ సీబీఐ అధికారి వెల్లడించారు. పీజీ విద్యార్థి డెడ్ బాడీని చూసేందుకు పేరెంట్స్‌ను ఎందుకు మూడు గంటల పాటు వెయింటింగ్ చేయించాడనే అంశంపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే, ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వెనక బడానేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తుంది. కాగా, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్ అనే వ్యక్తికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు స్థానిక కోర్టు నుంచి సీబీఐ అధికారులు ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నారు.
