DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- కాంగ్రెస్‌తో కూర్చునేది లేదు..
- లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ కోరిన డీఎంకే..
- కాంగ్రెస్-డీఎంకే మధ్య పెరిగిన దూరం..
- డీఎంకే నిర్ణయానికి ఓకే చెప్పినట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK: తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరాన్ని మరింత పెరిగింది. కూటమిగా పోటీ చేసి గెలిపిస్తే, ఓడిపోయిన తర్వాత విజయ్‌తో కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే జీర్ణించుకోలేకపోతోంది. డీఎంకేకు కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసిందని, ఇకపై ఆ పార్టీని నమ్మేది లేదని స్టాలిన్‌తో పాటు ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, లోక్‌సభలో కాంగ్రెస్‌తో కూర్చునేందుకు డీఎంకే నిరాకరించింది. ఇప్పటికే జూన్ 8న జరుగబోతున్న ఇండియా కూటమి మీటింగ్‌ను డీఎంకే బాయ్‌కాట్ చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ నుంచి వేరుగా, ప్రత్యేక సీటింగ్ కావాలని డిమాండ్ చేసిన డీఎంకేకు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. డీఎంకే తరుపున కనిమొళి, లోక్‌సభలో ప్రత్యేక సీటింగ్ కావాలని కోరారు. సంబంధిత వర్గాల ప్రకారం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డీఎంకే అభిప్రాయాలను, డిమాండ్లను లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేసింది. సీటింగ్‌పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
Also Read
ప్రస్తుతం, టీఎంసీ ఎంపీలు ఉన్న మూడో బ్లాక్‌కు డీఎంకే సభ్యుల్ని తరలించనున్నారు. ప్రస్తుతం అభిషేక్ బెనర్జీకి కేటాయించిన ముందు వరసలోని 354వ నంబర్ సీటును డీఎంకే నేత టీఆర్ బాలుకు కేటాయించే అవకాశం ఉంది. డీఎంకే ఎంపీలు కూర్చున్న స్థానాలకు టీఎంసీ ఎంపీలను తరలించే అవకాశం ఉంది.
ఈ వ్యవహారం ఇలా ఉంటే, ఇండియా కూటమి సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది. జూన్ 8న జరిగే ఈ సమావేశానికి హాజరుకాబోమని ప్రకటించింది. కాంగ్రెస్ పాల్గొంటున్న కారణంగా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించింది. తమిళనాడు ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, డీఎంకేను వదిలేసి విజయ్ టీవీకేకు మద్దతు ఇచ్చింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్క్ చేరుకునేందుకు సహకరించింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య స్నేహం దెబ్బతింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?