DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK MPs Meeting: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయడంతో.. మరోసారి ఈ వ్యవహారంపై రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.. దక్షిణాది పార్టీలు సూచించిన కొన్ని మార్పులు కూడా చేసేందుకు నరేంద్ర మోడీ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో.. ఆ పార్టీల వ్యూహం ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు డీఎంకే సిద్ధమైంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగే ఈ భేటీకి డీఎంకే ఎంపీలు హాజరుకానున్నారు.
నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు ప్రధాన చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వైఖరి, బిల్లును ఎదుర్కొనే వ్యూహంపై స్టాలిన్ ఎంపీలతో చర్చించనున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 7.18 శాతం ప్రాతినిధ్యం తగ్గకుండా చూడాలన్నది డీఎంకే ప్రధాన డిమాండ్‌గా ఉంది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాలకు ఉన్న ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలని స్టాలిన్ పట్టుబడుతున్నారు. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ కారణంగా అన్యాయం జరగకూడదన్నది డీఎంకే వాదనగా ఉంది.
Also Read
- Women's Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
- Thiruparankundram Deepam Row: తిరుపరంకుండ్రం దీపం వివాదం.. ‘మురుగనుక్కు ఆరోగరా’ అంటూ ప్రధాని మోడీ పోస్ట్
- Delimitation: లోక్‌సభలో సీట్లు పెరిగితే ఖర్చుల సంగతేంటి? పూర్తి లెక్కలివే!
- MLA Arul Vignesh Arrest: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అరెస్ట్
మరోవైపు, డీలిమిటేషన్‌కు సంబంధించి కొత్త బిల్లులో తమ డిమాండ్లకు తగిన రక్షణ ఉందా లేదా అనే అంశాన్ని డీఎంకే పరిశీలించనుంది. బిల్లులోని ప్రతిపాదనలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రానికి మద్దతు ఇవ్వాలా? వ్యతిరేకించాలా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దిశగా కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఆమోదించిన నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే ఎలాంటి వైఖరి తీసుకోనుంది? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో స్టాలిన్ వ్యూహం ఎలా ఉండబోతోంది? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. నేటి ఎంపీల సమావేశం తర్వాత డీఎంకే వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
DMK MPs Meeting: డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే వ్యూహం ఏమిటి? నేడు స్టాలిన్ కీలక భేటీ
-
HDFC Bank Alert: UPI పేమెంట్లు చేసేవారికి అలర్ట్.. HDFC బ్యాంక్ కొత్త రూల్.. జనవరి 1 నుంచి ఈ SMS అలర్ట్స్ బంద్..!
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్‌కు మళ్లీ కెప్టెన్సీ..
ట్రెండింగ్
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!