Site icon NTV Telugu

DK Shivakumar: ఆ ప్రశ్న జ్యోతిషుడిని అడగండి.. డీకే.శివకుమార్ అసహనం

Dk Shivakumar

Dk Shivakumar

కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది. దీనికి సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ ఏకకాలంలో ఢిల్లీలో ఉండడమే కారణం.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. అలాగే ఇంకో వైపు డీకే.శివకుమార్ కూడా హైకమాండ్ పెద్దలను కలుస్తు్న్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం తెరపైకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ఇక ఈ అంశం విలేకర్లు ప్రశ్నించగా డీకే.శివకుమార్ వైరెటీగా స్పందించారు. ఈ ప్రశ్న జ్యోతిషుడిని అడగాలంటూ బదులిచ్చారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది పూర్తిగా సిద్ధరామయ్య చేతిలో ఉంటుందని.. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రులు కావాలని ఆశ పడటంలో తప్పేమీ లేదన్నారు. ‘‘పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారందరికీ మంత్రులు కావాలని ఆశ ఉంటుంది. అది తప్పు అని ఎలా చెబుతాం?. వారిలో చాలామంది పార్టీ కోసం కష్టపడినవారు, త్యాగాలు చేసినవారు ఉన్నారు’ అని తెలిపారు. ఈ క్రమంలో నాయకత్వ మార్పు కూడా జరుగుతుందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. దీనికి ఆయన బదులిస్తూ.. ఆ ప్రశ్న జ్యోతిషుడినే అడగాలని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Umar: ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఏం జరిగింది.. వెలుగులోకి ఉమర్ సంచలన వీడియో

తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే కర్ణాటకలో నాయకత్వ మార్పులు లేనట్లుగా కనిపిస్తోంది. పూర్తిగా ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేనే కలిశాక.. సిద్ధరామయ్యకు ఆ భరోసా లభించినట్లు కనిపిస్తోంది.

Exit mobile version