Site icon NTV Telugu

DK Shivakumar: డీకే.శివకుమార్‌లో నైరాశ్యం.. కార్యకర్తగా ఉంటే బెటర్ అంటూ కామెంట్

Dk Shivakumar

Dk Shivakumar

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు డీకే.శివకుమార్ చాలా కృషి చేశారు. రాష్ట్రమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా కాంగ్రెస్ విజయం సాధించాక సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవిని తన్నుకుపోయారు. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే.శివకుమార్‌కు అడియాసలే మిగిలాయి.

ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో మిగిలిన రెండున్నరేళ్లైనా ముఖ్యమంత్రి కుర్చీ దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. హస్తినలో తిట్టవేసి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. అక్కడా కూడా ఫలితమివ్వలేదు. బెంగళూరులోకి షిఫ్ట్ అయి బేక్‌ఫాస్ట్‌లుగా మారింది. ఒకసారి సిద్ధరామయ్య ఇంట్లో.. ఇంకోసారి డీకే.శివకుమార్ ఇంట్లో అల్పాహర విందులు జరిగాయి. కానీ పురోగతి లేదు. ఇటీవల సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఐదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. దీంతో డీకే.శివకుమార్ గుండెలో పిడుగు పడినట్లైంది.

తాజాగా డీకే.శివకుమార్ నైరాశ్యం వ్యక్తం చేశారు. పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పని చేస్తూ వస్తున్నానని.. ఇప్పటికీ అదే కార్యకర్తగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌ సందర్భంగా ఎలాంటి చర్చలు జరిగాయో చెప్పలేనన్నారు. సంక్రాంతి తర్వాత పవర్ షేరింగ్ ఉండొచ్చా? అని అడిగిన ప్రశ్నకు అలాంటి వార్తలు మీడియాలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నాయకత్వ మార్పు అంశాలపై విదేశాల నుంచి వచ్చిన రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టదల్చుకోలేదని స్పష్టం చేశారు.

Exit mobile version