DJ Sound: ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లో ఓ విచిత్రమైన సంఘటన నమోదైంది. వివాహ వేడుకలో డీజే సౌండ్ కారణంగా సమీపంలో ఉన్న కోళ్ల ఫారంలో 140 కోళ్లు మరణించాయి. ఏప్రిల్ 25న, బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దరియాపూర్ గ్రామంలో పెళ్లి బారాత్ జరిగింది. గ్రామస్తుడు తన కుమార్తె వివాహం కోసం రామ్ భద్ర పూర్వా గ్రామం నుంచి డీజే సౌండ్‌తో బారాత్ వచ్చింది. ఊరేగింపు గ్రామం గుండా వెళ్తున్న సమయంలో పెద్ద శబ్ధంతో డీజే ప్లే చేశారు. ఈ సౌండ్‌కు పక్కనే ఉన్న సాబిర్ అలీకి చెందిన ఫౌల్ట్రీ ఫారంలోని కోళ్లు మరణించాయి.
Read Also: Tamil Nadu: విజయ్‌తో టచ్‌లోకి అన్నాడీఎంకే..
డీజే సౌండ్ వల్లే తన కోళ్లు మరణించాయని అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కవి యాదవ్ అనే డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేశారు. మరణానికి సరైన కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భరత్ సింగ్ తెలిపారు.
