NTV Telugu Site icon

West Bengal Governor: ర్యాగింగ్‌ను గుర్తించే సాంకేతికతను కనుగొనండి.. ఇస్రోకి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ లేఖ

West Bengal Governor

West Bengal Governor

West Bengal Governor: ర్యాగింగ్‌ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్‌ భూతం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ను కనుగొనే ఆధునిక సాంకేతికతను కనిపెట్టి.. ర్యాగింగ్‌ బారిని విద్యార్థులను రక్షించేలా చూడాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ కోరారు. ర్యాంగింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు విజ్ఞప్తి చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై నిషేధం ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల ఇది కొనసాగుతూనే ఉంది. ఏటా ఎంతో మంది విద్యార్థులు ర్యాగింగ్‌ రక్కసికి బలైపోతున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. ఈ క్రమంలోనే ర్యాంగింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అవసరమైన సాంకేతికతను గుర్తించేందుకు సాయం చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ లేఖ రాసినట్లు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Secretariat: సచివాలయంలో ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన సీఎం.. ఒకే వేదికపై కేసీఆర్, గవర్నర్..

కొద్దిరోజుల క్రితం పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పుర్‌ విశ్వవిద్యాలయం (Jadavpur University)లో స్వప్నదీప్‌ అనే డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు స్వప్నదీప్‌ మృతికి సీనియర్ల వేధింపులే కారణమని తేల్చారు. ఈ మృతిపై యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆనంద్‌ బోస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ర్యాగింగ్‌ను అడ్డుకునేందుకు సాంకేతిక సాయం అందించాలని ఇస్రోను కోరారు. క్యాంపస్‌లలో ర్యాగింగ్‌ను సమర్థవంతంగా నిరోధించడానికి మరియు తొలగించడానికి తగిన సాంకేతికతను గుర్తించడానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి వి ఆనంద బోస్ మరియు విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ను సంప్రదించారు. గవర్నర్‌ బోస్‌ హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్‌ డేటా ప్రాసెసింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ADRIN)తో కూడా చర్చించారు. సాంకేతికత వీడియో అనలిటిక్స్, ఇమేజ్ మ్యాచింగ్, ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్ మరియు రిమోట్ సెన్సింగ్ వంటి బహుళ వనరులను ఉపయోగించాలని భావిస్తున్నారు. జాదవ్‌పూర్ యూనివర్శిటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి వర్సిటీ హాస్టల్‌లోని బాల్కనీలో నుండి పడి మృతి చెందిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థి మృతికి సంబంధించి మొత్తం 12 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.