Site icon NTV Telugu

Empuraan Row: నా కొడుకును బలిపశువు చేయొద్దు.. ఎంపురాన్ వివాదంపై పృథ్వీరాజ్ తల్లి రియాక్షన్

Mallika

Mallika

Empuraan Row: ఎంపురాన్ మూవీపై వివాదం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. తాజాగా, ఈ వివాదంపై డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ తల్లి మల్లిక రియాక్ట్ అయ్యారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను, ఈ ఇష్యూపై మొదట స్పందించొద్దు అనుకున్నాను.. కానీ, తన కుమారుడిని కించపర్చేలా తప్పుడు వార్తలు చూసి బాధతో ఈ పోస్టును సోషల్ మీడియా వేదికగా పెడుతున్నాను అని చెప్పుకొచ్చింది.

Read Also: Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కోసం హైదరాబాద్‌కు నెల్లూరు పోలీసులు..

అయితే, ఎంపురాన్ మూవీ తెర వెనక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలుసు.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను అన్యాయంగా కొందరు నిందిస్తున్నారు అని మల్లిక తెలిపింది. మోహన్‌ లాల్‌, చిత్ర నిర్మాతలు ఎవరూ తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని ఎక్కడ కూడా చెప్పలేదు. మోహన్ లాల్ నాకు ఎన్నో రోజులుగా తెలుసు.. నా తమ్ముడితో సమానం అని పేర్కొనింది. నా కుమారుడిని ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రశంసించాడు. ఇప్పుడు ఆయనకు, నిర్మాతలకు తెలియకుండా కొందరు నా కొడుకుని బలిపశువుని చేయడానికి ట్రై చేస్తున్నారని మండిపడింది. అతడు ఎవరినీ మోసం చేయలేదు.. ఎప్పుడు చేయడు అని పృథ్వీరాజ్‌ తల్లి మల్లిక చెప్పింది.

Read Also: Triangle Love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్.. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

కాగా, ఈ సినిమాలో సమస్యలు ఉన్నాయంటే అది ఇందులో భాగమైన అందరికీ బాధ్యత ఉంటుందని డైరెక్టర్ పృథ్వీరాజ్‌ తల్లి మల్లిక అన్నారు. వారందరూ తొలుత స్క్రిప్ట్‌ చదివారు.. చిత్రీకరణ సమయంలో కూడా అందరూ ఉన్నారు.. వారందరీ ఆమోదంతోనే ఈ చిత్రం తెరకెక్కింది కదా అని ప్రశ్నించింది. రచయిత కూడా ఎప్పుడూ పక్కనే ఉన్నారు.. అవసరమైతే డైలాగుల్లో మార్పులు కూడా చేసే వారని తెలిపింది. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక పృథ్వీరాజ్‌ మాత్రమే ఎందుకు జవాబుదారీ అవుతాడు? అని అడిగింది. మోహన్‌ లాల్‌కు తెలియకుండా ఇందులో కొన్ని సన్నివేశాలు జత చేశారంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఆయన కూడా సినిమాను చూశారు. నా కుమారుడు ఎప్పుడూ ఎవరి వ్యక్తిగత నమ్మకాలను వ్యతిరేకించలేదని మల్లిక సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఇక, ఎల్‌2:ఎంపురాన్‌’ సినిమా మార్చి 27న విడుదల అయింది. ఇప్పటి వరకూ రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. అయితే, కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాలు నెలకున్నాయి. దీంతో మూవీ యూనిట్ సినిమాలో మొత్తం 17 సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు సమాచారం.

Exit mobile version