NTV Telugu Site icon

Bharat Jodo Yatra: కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్.. రాహుల్ పర్యటించిన మెజారిటీ స్థానాల్లో విజయం

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీజేపీ దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కన్నడ అసెంబ్లీలో కాంగ్రెస్ 137 స్థానాల్లో, బీజేపీ 64 స్థానాల్లో, 20 స్థానాల్లో దాదాపుగా గెలుపును ఖాయం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయానికి రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’నే కారణం అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ యాత్ర వల్లే ఈ స్థాయిలో విజయం వరించిందని వ్యాఖ్యాినించారు.

Read Also: Pallam Raju: మోడీ సర్కార్‌పై వ్యతిరేకత.. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం..

ఇదిలా ఉంటే కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ ఏకంగా భారత్ జోడో యాత్రం ప్రభావాన్ని తెలిపే స్టాటిస్టిక్స్ ని ట్వీట్ చేశారు. గతేడాది సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి మీదుగా కేరళ, కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఏకంగా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా ఈ యాత్ర జరిగింది. 3500 కిలోమీటర్ల పాదయాత్రను 150 రోజుల పాటు నిర్వహించారు.

ఇదిలా ఉంటే కర్ణాటకలో 20 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ పాదయాత్ర సాగింది. తాజాగా ప్రకటించి ఫలితాల్లో ఈ 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో ఆధిక్యం/విజయం కనబరిచింది. బీజేపీ 2, జేడీఎస్ 3 స్థానాలకే పరిమితం అయింది. 2018 ఎన్నికల్లో ఈ స్థానాాల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 5, స్థానాల్లో గెలుపొందాయి. ఇది కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ప్రభావం. యాత్రలో కర్ణాటక ప్రజలతో మాట్లాడామని, పార్టీని ఏకం చేయడంతో పాటు క్యాడర్ ను సమాయత్తం చేశామని, వీటి ద్వారానే మా మానిఫెస్టోలోని హామీలు, వాగ్ధానాలను చర్చించి ఖరారు చేశామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

Show comments