NTV Telugu Site icon

MUDA land scam: ‘‘తెరవెనక సిద్ధరామయ్య లేడని అంగీకరించడం కష్టం’’.. ముడా కుంభకోణంలో హైకోర్టు కామెంట్స్..

Muda Land Scam

Muda Land Scam

MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. ముడా ల్యాండ్ స్కాంలో సీఎంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ రోజు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి రావాలి’’ అని, సిద్ధరామయ్య పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లుగా తీర్పు చెప్పారు.

Read Also: GANJA: భద్రాచలంలో భారీగా గంజాయి పట్టివేత.. కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

దీంతో సీఎంపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ మరియు భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 218 కింద తనపై దర్యాప్తునకు మార్గం సుగమమైంది. మూడా భూముల లావాదేవీల్లో సిద్ధరామయ్య ‘‘తెర వెనక’’లేదని, అతడి కుటుంబానికి సుమారుగా రూ. 56 కోట్ల మేర లబ్ధి చేకూరిందనే విషయాన్ని అంగీకరించడం కష్టమని జస్టిస్ నాగ ప్రసన్న తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘‘రూ. 3.56 లక్షలగా నిర్ణయించిన పరిహారం, లబ్ధిదారుడికి రూ.56 కోట్లుగా మారడం అంగీకరించలేమని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు ఎందుకు, ఎలా నిబంధన మారింది. దీనిని దర్యాప్తు చేయాలి’’ అని న్యాయమూర్తి అన్నారు.

మైసూర్ నగరాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి భార్య పార్వతి నుంచి భూమి సేకరించిన ప్రభుత్వం, ఆమె భూమి కోల్పోయిన ప్రాంతంలో కాకుండా మైసూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను కేటాయించం వివాదాస్పదమైంది. దీనిపై ముగ్గురు ఆర్టీఐ యాక్టవిస్ట్‌లు గవర్నర్‌కి పిటిషన్ సమర్పించారు. దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఉత్తర్వులు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని సిద్ధరామయ్య కోర్టు ముందు వాదించారు.