Shocking incident: ఛత్తీస్గఢ్ లోని సియోని గ్రామంలో అద్భుతం జరిగింది. ప్రాణాలు పోయే సంఘటన నుంచి 20 రోజుల పసికందు ప్రాణాలతో బయటపడింది. ఒక కోతి పసికందును బావిలో పడేసింది. తల్లి చేతుల నుంచి లాక్కుని, సమీపంలోని బావిలో పడేసిన ఘటనలో, పసికందును ‘‘డైపర్’’ కాపాడింది. డైపర్ లైఫ్ జాకెట్గా మారి బేబీ బావిలో మునిగిపోకుండా అడ్డుకుంది. 10 నిమిషాల పాటు బావిలో తేలుతూనే ఉంది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘డెడ్ ఎకానమీ’’ కామెంట్స్.. స్పందించిన బీజేపీ..
స్థానికుల కథనం ప్రకారం, తల్లి బిడ్డకు పాలుపడుతున్న సమయంలో కోతి ఇంట్లోకి ప్రవేశించింది. బిడ్డను తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తల్లి కేకలు వేయడంతో స్థానికులు కోతిని వెంబడించారు. కోతి గ్రామస్తుల భయానికి బిడ్డను బావిలో విసిరేసింది. గ్రామస్తులకు బావిలో తేలుతున్న పసికందు కనిపించింది. వెంటనే వారంతా ఒక బకెట్ సాయంతో పసికందును నీటి నుండి బయటకు తీశారు. అదే సమయంలో ఒక మతపరమైన కార్యక్రమం కోసం గ్రామానికి వచ్చిన రాజేశ్వరి రాథోడ్ అనే నర్సు, పసికందుకు సీపీఆర్ అందించారు. కొన్ని క్షణాల్లో బిడ్డ తిరిగి శ్వాసను అందుకుంది. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం పసికందును స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కాలేదని వైద్యులు వెల్లడించారు.