Site icon NTV Telugu

Sabarimala: భక్త సంద్రంగా శబరిమల.. అయ్యప్ప ఆలయం వద్ద తాజా పరిస్థితులు

Shabarimala

Shabarimala

Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది. దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. కొందరు భక్తులు అయితే అయ్యప్ప దర్శనం చేసుకోకుండా వెనుదిరుగుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం స్వామివారి దర్శన సమయాన్ని గంటపాటు పెంచినా.. భక్తులు మాత్రం స్వామివారి దర్శనం చేసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శబరిమల భక్తులతో కిటకిటలాడుతుండగా, అయ్యప్ప శరణు ఘోషతో మారుమ్రోగుతోంది. అయితే.. శబరిమలకు వెళ్లే రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో అయ్యప్ప స్వామి భక్తులు దారిలో ఇబ్బందులు పడుతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు రోజుల తరబడి వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తమ సమస్యలను పరిష్కరించాలని ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read also: Dhiraj Sahu : బీరువాలు అయిపోయినయ్.. ఇంటి గోడలపై ఫోకస్ చేస్తున్న అధికారులు

శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు, సౌకర్యాలు సరిపోవడం లేదు. కాగా, శబరిమలకు భక్తులు అధిక సంఖ్యలో వెళుతుండటంతో భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్లే వారి కోసం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్, జనవరి నెలల్లో వేర్వేరు తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మాజీ వివిధ తేదీలలో నడుస్తున్న రైళ్ల సంఖ్యలు మరియు తేదీలతో పాటు అనేక వివరాలను పంచుకున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి వివిధ తేదీల్లో ప్రత్యేక రైళ్ల చార్ట్‌ను ప్రకటించింది.

Raviteja: ఈగల్ తగ్గే ప్రసక్తే లేదు… సంక్రాంతికే వస్తుంది

Exit mobile version