NTV Telugu Site icon

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం

Devendrafadnavis

Devendrafadnavis

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ (54) ప్రమాణం చేశారు. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ రాధాకృష్ణన్.. ఫడ్నవిస్‌తో ప్రమాణం చేయించారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు.  ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, ఎన్డీఏ కూటమి నేతలు, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి,  బాలీవుడ్ నటులు, క్రికెటర్లు, ముఖేష్ అంబానీ ఫ్యామిలీ  హాజరయ్యారు. దాదాపు ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజులకు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు సాధించాయి. ఇక మహా వికాస్ అఘాడీ ఘోరంగా విఫలం చెందింది. కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ పార్టీ 10 సీట్లు సాధించాయి.