Devendra Fadnavis: సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం.. దేనిపై చేశారంటే..!
- సీఎంగా ఫడ్నవిస్ తొలి సంతకం
- పూణె రోగికి రూ.5లక్షల సాయం ఫైల్‌పై సిగ్నేచర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు. పూణెకు చెందిన రోగి చంద్రకాంత్ శంకర్ కుర్హాడేకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5లక్షల సాయం అందించే ఫైల్‌పై ఫడ్నవిస్ తొలి సంతకం చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్ఫ్లాంట్(ఎముక మజ్జ మార్పిడి చికిత్స) కోసం రూ.5 లక్షల సాయం చేసి మానవత్వం చాటుకున్నారు.
ముంబైలో జరిగిన ప్రమాణస్వీకారంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల్లో మహాయుతి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా… భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) వరుసగా 20, 10 స్థానాలను గెలుచుకున్నాయి.
After taking oath as Maharashtra Chief Minister, Devendra Fadnavis, signed the to provide monetary assistance of Rs 5 lakh from the Chief Minister Medical Relief Fund to Pune patient Chandrakant Shankar Kurhade for bone marrow transplant treatment
(Source: CMO) pic.twitter.com/KqXwzYOoyh
— ANI (@ANI) December 5, 2024
తాజావార్తలు
-
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
-
BC Reservations: 34 శాతం బీసీ కోటాపై ఉత్కంఠ.. రిజర్వేషన్ల డేటా సమర్పించాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
Sardar2 : సర్దార్ -2 ఓవర్సీస్ రివ్యూ.. ఇది మరో సర్దార్ గబ్బర్ సింగ్
-
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
ట్రెండింగ్
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!