NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: సనాతనాన్ని రక్షించడానికే శివసేన-జనసేన.. పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.. మహాయుతి కూటమి తరపున.. బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్‌ షిండే పార్టీ), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు.. ఈ రోజు మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో మొదట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్‌ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.. జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతంగా చెప్పుకొచ్చారు.. బాలా సాహెబ్‌ ఠాక్రే (బాల్ ఠాక్రే) నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను.. శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇక, శివసేన-జనసేన అన్యాయంపై పోరాడతాయన్నారు.. ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాలాసాహెబ్‌ కోరుకున్నారని గుర్తుచేశారు.. బాలాసాహెబ్‌ కలలు కన్న అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు..

Read Also: Nayanthara Dhanush: హీరో ధనుష్ పై నయనతార సంచలన విమర్శలు.. నువ్వేంటో ఇప్పుడు తెలుస్తుంది

దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం అన్నారు పవన్‌ కల్యాణ్‌.. అయితే, ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతిలో ఉంది.. వీడిపోయి బలహీనపడదామా?.. లేదా కలిసి బలంగా నిలబడదామా?.. వీడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా? లేదా కలిసి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకుందామా?.. విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా? లేక కలిసి అభివృద్ధి.. సంక్షేమం వైపు నడిపిద్దామా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.. అయితే, మనం అందరం బాధ్యత గల పౌరులం.. ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌..