NTV Telugu Site icon

Zomato: “శాంతాక్లాజ్ డ్రెస్సింగ్‌తో ఫుడ్ డెలివరీ”.. హిందూ పండగల రోజు కాషాయం ధరిస్తారా..?

Madhya Pradesh

Madhya Pradesh

Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: Maharashtra: కాంట్రాక్ట్ ఉద్యోగి రూ. 21 కోట్ల ఘరానా మోసం.. గర్ల్‌ఫ్రెండ్‌కి BMW కార్, 4 BHK ఫ్లాట్ గిఫ్ట్..

మధ్యప్రదేశ్‌లో ఇండోర్ నగరంలో శాంటా క్లాజ్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీకి వెళ్తున్న ఏజెంట్‌ని ఆపి ‘హిందూ జాగరణ్ మంచ్’ దుస్తులను తొలగించేలా చేసింది. ‘‘మీరు ఎప్పుడైనా రాముడి వేషంలో ప్రజల ఇళ్లకు వెళ్లారా..?’’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు. దీనికి సమాధానంగా డెలివరీ ఏజెంట్ ..‘‘లేదు, కానీ కంపెనీ నన్ను ఈ దస్తులు ధరించమని కోరింది’’ అని చెప్పారు.

హిందూ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ సుమిత్ హార్దియా మాట్లాడుతూ.. డెలివరీలు హిందూ మెజారిటీ ప్రాంతంలో జరగుతున్నాయని, ఏజెంట్లు శాంటా క్లాజ్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హిందూయేతర పండగల్లో మాత్రమే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇండోర్, భారత్ రెండూ హిందూ మెజారిటీ ప్రాంతాలని, ఇలాంటి దుస్తులు ధరించి ఇళ్లలోకి ఎందుకు వెళ్తున్నారు..? వారు హనుమాన్ జయంతి, రామనవమి, దీపావళి వంటి హిందూ పండగల్లో ఎప్పుడైనా కాషాయ దుస్తులు ధరించారా..? అని ప్రశ్నించారు. మతమార్పిడి కోసం ఇలాంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫుడ్ డెలివరీ కంపెనీ యజమానలు ఏం ఆశించి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారని అడిగారు.