Zomato: “శాంతాక్లాజ్ డ్రెస్సింగ్తో ఫుడ్ డెలివరీ”.. హిందూ పండగల రోజు కాషాయం ధరిస్తారా..?
- శాంటా క్లాజ్ దుస్తులు ధరించి ఫుడ్ డెలివరీ..
- జొమాటో తీరుపై హిందూ గ్రూప్ ఆగ్రహం..
- హిందూ పండగల సమయంలో కాషాయం ధరిస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read
- NSUI Protest: సీజేపీ 'త్రివర్ణ యాత్ర'కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
మధ్యప్రదేశ్లో ఇండోర్ నగరంలో శాంటా క్లాజ్ దుస్తుల్లో ఫుడ్ డెలివరీకి వెళ్తున్న ఏజెంట్ని ఆపి ‘హిందూ జాగరణ్ మంచ్’ దుస్తులను తొలగించేలా చేసింది. ‘‘మీరు ఎప్పుడైనా రాముడి వేషంలో ప్రజల ఇళ్లకు వెళ్లారా..?’’ అని సదరు వ్యక్తిని ప్రశ్నించడం వీడియోలో చూడవచ్చు. దీనికి సమాధానంగా డెలివరీ ఏజెంట్ ..‘‘లేదు, కానీ కంపెనీ నన్ను ఈ దస్తులు ధరించమని కోరింది’’ అని చెప్పారు.
హిందూ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ సుమిత్ హార్దియా మాట్లాడుతూ.. డెలివరీలు హిందూ మెజారిటీ ప్రాంతంలో జరగుతున్నాయని, ఏజెంట్లు శాంటా క్లాజ్ దుస్తులు ధరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. హిందూయేతర పండగల్లో మాత్రమే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇండోర్, భారత్ రెండూ హిందూ మెజారిటీ ప్రాంతాలని, ఇలాంటి దుస్తులు ధరించి ఇళ్లలోకి ఎందుకు వెళ్తున్నారు..? వారు హనుమాన్ జయంతి, రామనవమి, దీపావళి వంటి హిందూ పండగల్లో ఎప్పుడైనా కాషాయ దుస్తులు ధరించారా..? అని ప్రశ్నించారు. మతమార్పిడి కోసం ఇలాంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫుడ్ డెలివరీ కంపెనీ యజమానలు ఏం ఆశించి ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారని అడిగారు.
A Zomato delivery man was stopped by Hindu Jagran Manch in Indore and asked to remove a Santa Claus attire. The delivery person tries to reason out that he needs to take a selfie with customers or else his ID will be blocked @zomato well? @zoo_bear pic.twitter.com/TNVNfzGhVI
— Veena Nair (@ve_nair) December 25, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!