Site icon NTV Telugu

ఎర్రకోట దగ్గర డ్రోన్ క‌ల‌క‌లం

Red Fort

Red Fort

భారత్‌-పాక్‌ సరహిద్దులతో మొదట కలలం సృష్టించిన డ్రోన్లు.. ఆ తర్వాత జమ్మూ ఎయిర్‌పోర్ట్‌పై దాడికే ఉపయోగించారు.. ఇక, అప్పటి నుంచి ఎక్కడ డ్రోన్లు కదలినా.. అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇవాళ ఎర్రకోట స‌మీపంలో డ్రోన్‌ ఎగరడంతో కలకలమే రేగింది.. వెంటనే ఆ డ్రోన్‌ను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట వెనుక భాగంలో విజ‌య్ ఘాట్ మీదుగా డ్రోన్ ఎగిరింది.. ఈ ప్రాంతంలో వెబ్ సిరీస్ షూటింగ్‌కు పోలీసులు అనుమ‌తి ఇచ్చినా.. డ్రోన్‌కు మాత్రం అనుమతి లేదు.. కానీ, నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వెబ్ సిరీస్ షూటింగ్‌ కోసం డ్రోన్‌ ఉపయోగించారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేశారు.

మరోవైపు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుక‌ల‌కు ముస్తాబవుతోంది ఎర్రకోట… ఇప్పటికే ఐబీ హెచ్చరికలు ఉండడంతో.. దేశ రాజధానిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఇదే సమయంలో డ్రోన్‌ ఎగరడం కలకలం రేపింది.. ఇక, పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్ధలు డ్రోన్‌లను ఉప‌యోగించి దాడుల‌కు పాల్పడ‌వ‌చ్చనే నిఘా వ‌ర్గాల హెచ్చరికలు కూడా ఉన్నాయి.. దీంతో.. గట్టి నిఘా పెట్టి.. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Exit mobile version