NTV Telugu Site icon

Sukesh Chandrashekar Case: నటి నోరా ఫతేహిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు

Nora Fatehi

Nora Fatehi

Sukesh Chandrashekar Case: సుకేష్ చంద్రశేఖర్ కేసుకు సంబంధించి నటి నోరా ఫతేహిని ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం శుక్రవారం ప్రశ్నించింది. నోరా ఫతేహిని 50 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆమెకు ఎలాంటి బహుమతులు వచ్చాయి, ఎవరితో మాట్లాడింది, వారిని ఎక్కడ కలిశారని పోలీసులు అడిగినట్లు తెలిసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను సుకేష్‌తో విడిగానే మాట్లాడినట్లు వెల్లడించింది. నెయిల్ ఆర్ట్ ఫంక్షన్ కోసం అతని భార్య తనతో మాట్లాడిందని, ఆపై తరచూ తనకు ఫోన్ చేసేదని ఆమె చెప్పారు. వారు ఆమెకు బీఎండబ్ల్యూ, ఇతర కార్లను బహుమతిగా ఇచ్చారని వెల్లడించింది. అయితే అతని నేరనేపథ్యం తనకు తెలియదని నోరా ఫతేహి పోలీసులకు తెలిపింది. సుకేష్ తన మేనేజర్, కజిన్‌తో ఎక్కువగా మాట్లాడే వాడని చెప్పింది.

17ఏళ్ల నుంచే నేర ప్రపంచంలో మునిగి మోసగాడిగా పేరున్న సుకేశ్ చంద్రశేఖర్, ఆయన భార్య, నటి లీనా పాల్‌‌లపై ఢిల్లీ పోలీసులు అఫెన్స్ వింగ్ కేసు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, చీటింగ్, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలపై కేసు రిజిస్టర్ చేసింది. ఈ కేసులోని విషయాలపై స్పష్టత కోసం ఈడీ అటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇటు నోరా ఫతేహిలను ప్రశ్నిస్తున్నది. ఇప్పటి వరకైతే వీరు ఈ కేసులో నిందితులు కాదని సంబంధితవర్గాలు తెలిపాయి. అయితే, బలవంతపు వసూళ్ల ద్వారా వచ్చిన సొమ్ములో వీరేమైనా బెనిఫిట్ పొందారా? అనే కోణంలో వీరిపై ప్రశ్నలు కురిపిస్తోంది. 200 కోట్ల దోపిడీ కేసులో సుకేష్ చంద్రశేఖర్, నటి లీనా మారియా పాల్‌ను ఢిల్లీ కోర్టు మూడు రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఢిల్లీ జైలు నుంచి సాగుతున్న దోపిడీ రాకెట్‌లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వీరిని అరెస్టు చేశారు.

India vs Pakistan: ఆసియా కప్‌లో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌.. రేపే భారత్‌-పాక్‌ ఢీ..

సుకేశ్ చంద్రశేఖర్ రూ. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో, నోరా ఫతేహి వంటి మరికొందరు ప్రముఖులను సాక్షిగా చేర్చారు. అస‌లు తాను ఏ నేరం చేయ‌లేద‌ని, ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్‌కు చిక్కినట్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటోంది. సుకేష్ చంద్రశేఖర్, అతని సహచరుడి నుండి 7 కోట్లు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు ఆమె కుటుంబం కూడా మోసగాడి నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ఈడీ ఆధారాలను కూడా సమర్పించింది. జాక్వెలిన్‌తో పాటు, నోరా ఫతేహి వంటి కొంతమంది సెల‌బ్రిటీల పేర్లు కూడా బయటకు వ‌చ్చాయి. సుకేష్ నుండి బహుమతులు అందుకున్నవారిలో నోరాను సాక్షిగా పేర్కొనగా, జాక్వెలిన్‌ను మాత్రం నిందితుల్లో ఒకరిగా చేర్చారు. ఇది అన్యాయ‌మంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

పీఎంఎల్‌ఏ అప్పీలేట్ అథారిటీ ముందు ఆమె దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లో, సాక్ష్యంలో భాగంగా సమర్పించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, నేరంతో ఎలాంటి సంబంధం లేదని, తాను సొంతంగా సంపాదించిన ఆదాయాన్నే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాన‌ని, సుకేష్ చంద్రశేఖర్ గురించి తనకు తెలియక ముందే డిపాజిట్లు ఉన్నాయ‌ని, దర్యాప్తుకు స‌హ‌క‌రించాన‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటిష‌న్‌లో పేర్కొంది. ఇతరుల మాదిరిగానే మోసగాడు సుకేష్ చేతిలో మోసపోయిన బాధితురాలిన‌ని జాక్వెలిన్ వాదిస్తోంది.

ఇదిలా ఉండగా, సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులో సెప్టెంబర్ 26న భౌతికంగా హాజరు కావాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ట్రయల్ కోర్టు సమన్లు ​​జారీ చేసింది.