144 section kcr residence: ఢిల్లీలోని తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఈడీ అధికారులు ఇవాల ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణకు ముందు కవిత మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో కేసీఆర్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా మరోవైపు, కవితను ఈడీ రెండో సారి విచారించనున్న నేపథ్యంలో తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుండటంతో.. కవితకు తోడుగా ఉండేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయనతో ఆపాటు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉన్నారు.
Read also: Bandi sanjay: సరే ఆరోజే రండి.. బండి సంజయ్ లేఖపై స్పందించిన మహిళా కమీషన్
కవితను ఈడీ విచారించనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ కీలక నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ మరింత పెరుగుతోంది. కాగా.. ఒక వేళ కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగే అవకాశాలున్నాయని సమాచారం. ఈ నెల 11న కవితను తొలిసారిగా ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. 16న మరోసారి విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ అధికారులు తనను వేధిస్తున్నారని, విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతున్నారు.
New Zealand: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ