NTV Telugu Site icon

Delhi Elections: తెరపైకి దళిత ముఖ్యమంత్రి!, డిప్యూటీ సీఎం పోస్టు కూడా..! బీజేపీ స్ట్రాటజీ ఇదేనా?

Delhicm

Delhicm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ రెండు దేశాల విదేశీ పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్, అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చాక.. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో భేటీ!

అయితే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో చాలా మాస్టర్ ప్లాన్‌తో వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచేలా దేశ రాజధాని ఢిల్లీలో ఒక దళిళ ముఖ్యమంత్రిని ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తు్న్నాయి. ఇప్పటికే రాష్ట్రపతిగా ఎస్టీ వర్గానికి చెందిన మహిళను కూర్చోబెట్టారు. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఒక దళిత మహిళను ఎంపిక చేయాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. ఇలా ఎస్సీ, ఎస్టీ వర్గాలను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి పోస్టుతో పాటు ఉప ముఖ్యమంత్రి ఎంపిక కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇలా కేబినెట్ అంతా బలహీన వర్గాలతో నింపాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ఆల్రెడీ హైకమాండ్ పెద్దలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: AP Government: మాదక ద్రవ్యాలపై యుద్ధం.. విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు..

తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ బీజేపీ పెద్దలు మాత్రం… అందుకు భిన్నంగా మహిళా ముఖ్యమంత్రి కోసం కసరత్తు చేస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి నలుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. షాలిమార్‌బాగ్ నుంచి రేఖా గుప్తా ఆప్ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. గ్రేటర్ కైలాష్ నుంచి శిఖా రాయ్.. ఆప్ కీలక నేత సౌరభ్ భరద్వాజ్‌ని 3,188 ఓట్ల తేడాతో ఓడించారు. వజీర్‌పూర్ నుంచి పూనమ్ శర్మ… ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాను మట్టికరిపించారు. నీలం పెహల్వాన్ నాజాఫ్‌గఢ్ నుంచి ఆప్ నేత తరుణ్ కుమార్‌పై 29 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏదేమైనా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మాత్రం చాలా వ్యూహాత్మకంగా బీజేపీ వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఇక కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఇంటి బాట పట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం అతి కష్టం మీద స్వల్ప మెజార్టీతో కల్కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: UK: హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకున్న బ్రిటన్ ప్రధాని.. ఆదర్శంగా నిలిచిన స్టార్మర్