Site icon NTV Telugu

Covid Variant: కలవరపెడుతున్న కరోనా.. వేరియంట్‌పై ఢిల్లీ ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి అధ్యయనం

Covid Variant

Covid Variant

Covid Variant: దేశ రాజధానిలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి కొవిడ్‌ వేరియంట్ మ్యుటేషన్‌పై అధ్యయనం నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదిక ఇంకా విడుదల కాలేదు. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో ఏమైనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందా అని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం చేశామని.. కొవిడ్ స్ట్రెయిన్‌పై అధ్యయన నివేదిక వచ్చేవారం ప్రారంభంలో వస్తుందని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ వెల్లడించారు.

కొవిడ్ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్ సురేశ్ కుమార్.. ప్రజలు కొవిడ్ నిబంధనలను సరిగా పాటించడం లేదన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రత స్వల్పంగానే ఉందన్నారు. ప్రజలు బూస్టర్ డోస్ కూడా తీసుకున్నందున తాము ఆసుపత్రిలో చేరిన కేసులను నివేదించడం లేదని… అయినప్పటికీ, చాలా మంది ఇప్పటికీ బూస్టర్ డోస్ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఆయన వెల్లడించారు.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించిన బైడెన్‌ సర్కార్‌

కొవిడ్ కేసులు కచ్చితంగా పెరుగుతున్నాయని.. కానీ తీవ్రత స్వల్పంగా ఉంటోందని ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ మోడీ అన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారని ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పచత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరేన్ గుప్తా వెల్లడించారు. కోవిడ్-తగిన ప్రవర్తనను అనుసరించని వ్యక్తులు ఇబ్బందుల్లో పడతారు.కొవిడ్ ఇంకా పూర్తిగా పోలేదని, మూడు నెలల క్రితం పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు కూడా మళ్లీ పాజిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ అవుతోందన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం పంచుకున్న డేటా ప్రకారం.. భారతదేశంలో గత 24 గంటల్లో 20,551 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 1,35,364 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Exit mobile version