Delhi JNU Clash: తీవ్ర ఘర్షణకు దారి తీసిన ‘యూపీ-బీహార్’ వ్యాఖ్య.. కొట్టుకున్న విద్యార్థులు
- ఢిల్లీ జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తతలు
- తీవ్ర ఘర్షణకు దారి తీసిన ‘యూపీ-బీహార్’ వ్యాఖ్య
- కొట్టుకున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యార్థి సంఘాల ఎన్నికల ముందు ఢిల్లీ జేఎన్‌యూలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా విభజన వ్యాఖ్య హింసకు ప్రేరేపించింది. జేఎన్‌యూ క్యాంపస్‌లో యూపీ, బీహార్ విద్యార్థులు ఉండటానికి అర్హులు కాదని.. వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపించాలని ఒక వర్గం వారు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ విభజన వ్యాఖ్య విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర కొట్లాటకు దారి తీసింది. విద్యార్థి సంఘాల నాయకులు కొట్లాటకు దిగడంతో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్‌గాంధీ ఎద్దేవా
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఏబీవీపీ కారణంగానే క్యాంపస్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది. విభజన వ్యాఖ్యతో ఏబీవీపీ పోకిరితనం బయటపడిందని.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణంగా ఘర్షణకు దారి తీసిందని ఆరోపించింది. ఇక బీజేపీ విద్యార్థి విభాగం మాత్రం వామపక్ష కౌన్సెలర్ రెచ్చగొట్టడం వల్లే హింస చెలరేగిందని ఆరోపించింది.
గురువారం ఉదయం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశం (GBM) సందర్భంగా ఏఐఎస్ఏ అనుబంధ విద్యార్థులు ఏబీవీపీ కార్యకర్తలతో ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. హింసకు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు, ఏఐఎస్ఏ నాయకుడు నితీష్ కుమారే కారణమని ఏబీవీపీ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి
జేఎన్‌యూలో ప్రస్తుతం జనరల్ బాడీ సమావేశాలు జరుగుతున్నాయి. నాలుగు కేంద్ర ప్యానెల్ స్థానాల్లో AISA మూడు, ABVP ఒకటి కలిగి ఉంది. ఈ క్రమంలో శాంతి, ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తున్నారని ఇరు వర్గాలు తరచుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో GBMని ABVP అడ్డుకుని.. విద్యార్థులను కొట్టారని AISA ఆరోపించింది. జేఎన్‌యుఎస్‌యూ అధ్యక్షుడిని ఏబీవీపీ కార్యకర్తలు గంటకు పైగా కొట్టారని AISA ఆరోపించింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!