Site icon NTV Telugu

High Court: మారిటల్‌ రేప్‌.. కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు

వైవాహిక జీవితంలో బలవంతపు శృంగారాన్ని నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌లో ఉంచింది ఢిల్లీ హైకోర్టు. మరింత గడువు కోరుతూ.. పిటిషన్‌ విచారణ వాయిదా వేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది హైకోర్టు.. అయితే, పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కోరారు సాలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా‌.. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు ఫిబ్రవరి 10న అభిప్రాయ సేకరణకు సమాచారం అందించామని, అయితే, ఇంకా స్పందన రాలేదని కోర్టుకు తెలిపారు. కానీ, కేంద్రం విజ్ఞప్తిని తోసిపుచ్చింది హైకోర్టు.. ఈ సందర్భంగా జస్టిస్‌ రాజీవ్ శక్ధేర్, జస్టిస్‌ సి హరిశంకర్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రం వైఖరిని ‘త్రిశంకు’’ లాంటిదని పేర్కొంది.. గడువు కోరే అంశం ఎప్పుడో దాటిపోయిందని గుర్తు చేసింది ధర్మాసనం..

Read Also: COVID19: భారత్‌లో ఇవాళ ఎన్నికేసులంటే..?

Exit mobile version