Site icon NTV Telugu

Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు

Flu 1

Flu 1

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది.

ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇండియాలో 2400కి పైగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి. మాస్క్ నిబంధనను తప్పనిసరి చేస్తున్నాయి. మాస్క్ లేకుండా తిరిగితే జరిమానాలు వేయాలని ఢిల్లీ ప్రభుత్వం సూచించింది. మరోవైపు ఢిల్లీలో ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్లూ లక్షణాలే కదా అని నిర్లక్ష్యం వద్దంటున్నారు డాక్టర్లు. ఈతరహా లక్షణాలు మూడు రోజులకు మించి కొనసాగితే కనుక వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, అతిసారం, తీవ్ర బలహీనత, మగతగా ఉండడం, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గడం ఇవన్నీ మూడు రోజులకు మించి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలనేది సూచించారు.

ఆలస్యం చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇన్ ఫ్లూయెంజా లక్షణాలున్న కేసులు గత వారం రోజుల్లో 30 శాతం పెరిగినట్లు తెలిపారు. గత వారం రోజుల్లో ఓపీకి వస్తున్న రోగుల్లో 40 శాతం మందిలో ఇన్ ఫ్లూయెంజా తరహా అనారోగ్య లక్షణాలు ఉంటున్నాయని ప్రముఖ ఆస్పత్రి వైద్యులు అంటున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టినా వివిధ లక్షణాలు మాత్రం అలాగే వున్నాయంటున్నారు వైద్యులు. జ్వరం, దగ్గు, డయేరియా ఇతర లక్షణాలు కనిపించి రెండు మూడు రోజుల్లోనే తగ్గిపోతున్నాయి. అయినా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

Read Also: Bomb Blast: ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్ర దాడి.. 33 మంది మృతి.. 43 మందికి తీవ్రగాయాలు

Exit mobile version