NTV Telugu Site icon

Delhi Election Results 2025 Live Updates : హస్తినాలో కమలం జోరు.. మాజీ సీఎం కేజ్రీవాల్ ఓటమి.. లైవ్ అప్ డేట్స్..

Delhi

Delhi

Delhi Election Results 2025 Live Updates: ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. కాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం చెందారు.. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓడారు.. ఇప్పటికే చాలా స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత తిరిగి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

  • 08 Feb 2025 01:39 PM (IST)

    ఓడిన సోమనాథ్ భారతి..

    ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోమనాథ్ భారతి కూడా మాలవీయ నగర్ నుంచి పోటీ చేసిన ఓటమిపాలయ్యారు.

  • 08 Feb 2025 01:18 PM (IST)

    కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఆతీశీ విజయం..

    కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఆతీశీ విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు. ఆయన ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధురిని ఓడించారు. మరోవైపు ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ కూడా షకుర్ బస్తీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. షాలిమార్ బాగ్ నుంచి బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తా 29595 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

  • 08 Feb 2025 01:17 PM (IST)

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రియాంక గాంధీ స్పందిన..

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు.

  • 08 Feb 2025 01:16 PM (IST)

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హావా..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హావా.. 27 ఏళ్ల తర్వాత అధికారంలోకి బీజేపీ.. కమలం దెబ్బకి ఆప్ కీలక నేతలు ఓటమి.. అతిశీ మినహా ఆప్ కీలక నేతలు పరాజయం..

  • 08 Feb 2025 12:54 PM (IST)

    మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఓటమి..

    షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్రజైన్ ఓటమి.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు ఈ ఎన్నికల్లో ఓటమి.. జైలుకు వెళ్లొచ్చిన ముగ్గురు ఆప్ నేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ ఓటమి.. ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మ.. అమిత్ షాతో భేటీ అయినా పర్వేష్ వర్మ..

  • 08 Feb 2025 12:53 PM (IST)

    ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి..

    ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి.. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ పరాజయం.. బీజేపీ నేత పర్వేష్ సాహిబ్ సింగ్ చేతిలో కేజ్రీవాల్ ఓటమి.. 3 వేల ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ను ఓడించిన న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు..

  • 08 Feb 2025 12:37 PM (IST)

    ఓటమిని ఒప్పుకున్న మనీష్ సిసోడియా..

    జంగ్‌పురా స్థానం నుంచి ఆప్ నేత మనీష్ సిసోడియా ఓటమిని అంగీకరించారు. జంగ్‌పురా ప్రేమ, అనురాగం, సమానత్వాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన దాదాపు 600 ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

  • 08 Feb 2025 12:28 PM (IST)

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ.. గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీకి ఈసారి పూర్తి ఆధిక్యం.. హ్యాట్రిక్ కొట్టలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ..

  • 08 Feb 2025 12:26 PM (IST)

    మనీష్ సిసోడియా ఓటమి..!

    జంగ్పురా స్థానం నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియా ఓడిపోయారు. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో, కేజ్రీవాల్, ఆతీశీ వెనుకబడి ఉన్నారు.

  • 08 Feb 2025 12:08 PM (IST)

    పలు నియోజకవర్గ ఫలితాలు విడుదల..

    ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు. అదే సమయంలో న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ 1800 ఓట్ల వెనుకబడి ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ పెద్ద ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు.

  • 08 Feb 2025 11:58 AM (IST)

    ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది: ఎంపీ రఘు నందన్ రావు..

    "ఢిల్లీలో కాంగ్రెస్కు గాడిద గుడ్డు వచ్చింది.. తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు గాడిద గుడ్డే వస్తుంది.. బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయం.. ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయింది." అని బీజేపీ ఎంపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు.

  • 08 Feb 2025 11:56 AM (IST)

    వెనుకంజలో సీఎం ఆతీశీ..

    కల్కజీలో 6 రౌండ్లు ముగిసే సరికి 3,231 ఓట్ల వెనుకంజలో సీఎం ఆతీశీ.. మెహ్రౌలిలో 886 ఓట్ల ఆధిక్యంలో గజేందర్సింగ్ యాదవ్ (బీజేపీ), రాజిందర్ నగర్లో 203 ఓట్ల లీడ్లో దుర్గేశ్ పాఠక్(ఆప్), సంగమ్విహార్లో 271 ఓట్ల ఆధిక్యంలో చందన్కుమార్ చౌదరి (బీజేపీ)

  • 08 Feb 2025 11:52 AM (IST)

    జంగ్పురాలో మనీష్ సిసోడియా ముందంజ..

    జంగ్పురాలో మనీష్ సిసోడియా ముందంజ.. ఇప్పటివరకు ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తి.. కల్కాజీలో ఎనిమిదో రౌండ్ తర్వాత రమేష్ బిధురి 1911 ఓట్ల ఆధిక్యం..

  • 08 Feb 2025 11:32 AM (IST)

    బీజేపీ కార్యాలయానికి మోడీ..

    ప్రధాని మోడీ సాయంత్రం 7 గంటలకు బీజేపీ కార్యాలయాన్ని సందర్శిస్తారు. అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ ఖాతా తెరవ లేదు.

  • 08 Feb 2025 11:23 AM (IST)

    మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్..

    ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్.. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ సెటైర్.. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ట్వీట్..

  • 08 Feb 2025 11:22 AM (IST)

    రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్..

    ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ.. రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్.. ఐదు రౌండ్ల తర్వాత 386 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ సిసోడియా.. 10 సీట్లలో రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా.. కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ.. 14 సీట్లలో రెండు పార్టీల మధ్య 3 వేల ఓట్ల తేడా..

  • 08 Feb 2025 10:57 AM (IST)

    ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ..

    ఢిల్లీలో బీజేపీ, ఆప్ మధ్య హోరాహోరీ.. రౌండ్ రౌండ్ కు మారుతున్న ఫలితాల ట్రెండ్.. ఐదు రౌండ్ల తర్వాత 386 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్.. జంగ్ పూరాలో 2,345 ఓట్ల ఆధిక్యంలో మనీష్ సిసోడియా.. 10 సీట్లలో రెండు పార్టీల మధ్య స్వల్ప ఓట్ల తేడా.. కేవలం వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థుల ముందంజ.. 14 సీట్లలో రెండు పార్టీల మధ్య 3 వేల ఓట్ల తేడా..

  • 08 Feb 2025 10:56 AM (IST)

    ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపని కాంగ్రెస్..

    ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరో.. ఒక్క స్థానంలోనూ ఆధిక్యం చూపని కాంగ్రెస్.. అన్ని చోట్ల మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్.. న్యూఢిల్లీలో 386 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్.. బీజేపీకి, ఆప్ కి మధ్య ఓట్ షేర్ తేడా కేవలం 5 శాతం మాత్రమే..

  • 08 Feb 2025 10:47 AM (IST)

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల శాతం..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 43 శాతం, కాంగ్రెస్ పార్టీకి కేవలం 6.7 శాతం మాత్రమే ఓట్ షేర్..

  • 08 Feb 2025 10:46 AM (IST)

    ఉత్కంఠ రేపుతున్న న్యూఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్..

    ఉత్కంఠ రేపుతున్న న్యూఢిల్లీ అసెంబ్లీ కౌంటింగ్.. 3 రౌండ్లు ముగిశాక 343 ఓట్ల ఆధిక్యంలో కేజ్రీవాల్.. అరవింద్ కేజ్రీవాల్, పర్వేష్ సాహెబ్ సింగ్ మధ్య హోరాహోరీ.. న్యూఢిల్లీ సెగ్మెంట్ లో ఇంకా మిగిలి ఉన్న 10 రౌండ్ల కౌంటింగ్..

  • 08 Feb 2025 09:44 AM (IST)

    బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ..

    ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ కూడా 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యం కోల్పోయింది..

  • 08 Feb 2025 09:31 AM (IST)

    హాఫ్ సెంచరీ కొట్టిన బీజేపీ..

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. 50 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో ఆప్ లీడ్.. కిందటి ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 50 స్థానాల్లో ఆధిక్యం..

  • 08 Feb 2025 09:23 AM (IST)

    ఓఖ్లాలో 8 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ..

    ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 8 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి.. జనక్‌పురి నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ సూద్ ముందంజ.. కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా, సందీప్ దీక్షిత్ వెనుకంజ.. పట్పర్‌గంజ్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనకంజ.. రాజేంద్ర నగర్ నుంచి ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ లీడ్... ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యం.. ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యం.. ఒకే స్థానానికి పరిమితమైన హస్తం..

  • 08 Feb 2025 09:11 AM (IST)

    1500 ఓట్ల వెనకంజలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

    1500 ఓట్ల వెనకంజలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.. 24 స్థానాల్లో ఆప్ ఆధిక్యం.. ఒక స్థానంలో కాంగ్రెస్.. కరవాల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఆధిక్యం.. కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ బద్లి నుంచి ముందంజ..

  • 08 Feb 2025 08:57 AM (IST)

    40 స్థానాల్లో దూసుకుపోతున్న కమలం...

    ఎర్లీ ట్రెండ్స్‌లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ.. 40 స్థానాల్లో దూసుకుపోతున్న బీజేపీ.. 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజ.. ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం..

  • 08 Feb 2025 08:46 AM (IST)

    ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ..

    పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు..ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెనకంజ.. ప్రస్తుతం 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.. 18 స్థానాల్లో ఆప్ ఆధిక్యం.. ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్..

  • 08 Feb 2025 08:41 AM (IST)

    24 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    ఢిల్లీ ఎన్నికల్లో సగం సీట్లకు సంబంధించిన తొలి ట్రెండ్స్ వచ్చాయి. పోటీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ 24 స్థానాల్లో, ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది..

  • 08 Feb 2025 08:30 AM (IST)

    వెనుకపడ్డ కేజ్రీవాల్, అతిషి, సిసోడియా..

    పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కేజ్రీవాల్, అతిషి, సిసోడియా అందరూ వెనుకబడ్డారు. ఇప్పటివరకు బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 13 స్థానాల్లో ఆధిక్యం.. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం..

  • 08 Feb 2025 08:24 AM (IST)

    న్యూ ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ..

    కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో జంగ్‌పురాలో మనీష్ సిసోడియా వెనుకంజ.. న్యూ ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ.. 14 స్థానాల్లో బీజేపీ ముందంజ- ఆప్-9, కాంగ్రెస్- 1..

  • 08 Feb 2025 08:19 AM (IST)

    5 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం..

    ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. బీజేపీకి అనుకూలం.. 5 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ..  ఒక స్థానంలో ఆప్ ఆధిక్యం.. ఢిల్లీలోని 70 స్థానాల్లో ఓట్ల లెక్కింపు..

  • 08 Feb 2025 08:03 AM (IST)

    కౌంటింగ్ ప్రారంభం..

    ఢిల్లీలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్.. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 5,000 మంది సిబ్బంది.. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. తర్వాత ఈవీఎంల కౌంటింగ్.. 70 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్-36..

  • 08 Feb 2025 07:56 AM (IST)

    ఆలయాలకు పరుగులు తీస్తున్న అభ్యర్థులు...

    ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయాన్ని లేచి.. దేవాలయాలకు పరుగులు తీస్తున్నారు. స్థానిక ఆలయాలకు చేరుకుని దేవీదేవతలను దర్శించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆప్ రాజధాని పగ్గాలు దక్కించుకుంటుందని కేజ్రీవాల్ వర్గం ఆశా భావం వ్యక్తం చేస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.

  • 08 Feb 2025 07:41 AM (IST)

    ఓట్ల లెక్కింపునకు 5,000 మంది సిబ్బంది..

    షాహ్దారా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు, దక్షిణ, నైరుతి జిల్లాల్లో ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నార్త్, వెస్ట్, నార్త్-ఈస్ట్, ఆగ్నేయ జిల్లాల్లో రెండు లెక్కింపు కేంద్రాలు ఉండగా, ఓట్ల లెక్కింపు జరిగే న్యూఢిల్లీ, నార్త్-వెస్ట్ జిల్లాల్లో మూడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 5,000 మంది సిబ్బందిని నియమించారు..