Delhi Poll 2025: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ నేతలు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఢిల్లీ సీఎం ఆతిశీ, ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర మంత్రి జై శంకర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ స్టార్ట్ అయినప్పటికి.. ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
Read Also: Ambati Rambabu: గుంటూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై మాజీ మంత్రి ఫైర్
ఇక, ఢిల్లీలోని ఏఏ ప్రాంతంలో ఎంత ఓటింగ్ శాతం అంటే..?
సెంట్రల్ ఢిల్లీ-16.46
తూర్పు- 20.03
న్యూఢిల్లీ- 16.80
ఉత్తర ఢిల్లీ- 18.63
ఈశాన్య ఢిల్లీ- 24.87
వాయువ్య ఢిల్లీ- 19.17
షాదారా- 23.30
దక్షిణ ఢిల్లీ- 19.17
ఆగ్నేయ ఢిల్లీ- 19.66
నైరుతి ఢిల్లీ – 21.90
పశ్చిమ ఢిల్లీ- 17.67
దీంతో పాటు తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) 26.03 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో 29.86 శాతం పోలింగ్ ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు నియోజకవర్గాల్లో నమోదైంది. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతితో అక్కడ బైపోల్ అనివార్యమైంది.. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.