Site icon NTV Telugu

Land for jobs Scam: మనీ లాండరింగ్‌ కేసులో లాలూ, తేజస్వినీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు

Lalu

Lalu

Land for jobs Scam: మనీ లాండరింగ్‌ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వినీ యాదవ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్న టైంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణంతో సంబంధమున్న మనీలాండరింగ్‌ స్కామ్ కేసులో కోర్టు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌ ప్రతాప్ యాదవ్‌కు, మరికొందరికి కూడా న్యాయస్థానం నోటీసులు పంపింది. అక్టోబరు 7వ తేదీ లోపు తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

Read Also: BJP MP Laxman: ప్రధాని మోడీ వంద రోజుల పాలన ట్రైలర్ మాత్రమే..

కాగా, 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేసిన టైంలో భారతీయ రైల్వేలో గ్రూప్‌-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద ఈడీ కేసు ఫైల్ చేసింది. గతేడాది మార్చిలో ఢిల్లీ, బీహార్‌, ముంబయిలలో మొత్తం 25 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఆ తర్వాత లాలూ కుటుంబసభ్యులు ముగ్గురితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్‌ను సీబీఐ రూపొందించింది. లాలూ సతీమణి, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్‌, లాలూ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగితో పాటు లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్‌లతో పాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్‌పోర్ట్స్‌లపై అభియోగాలను మోపింది.

Exit mobile version