మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మెట్రోలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. గురువారం ఆమె ఢిల్లీ గేట్ నుంచి లాజ్‌పత్ నగర్ వరకు మెట్రోలో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె మెట్రోలోని ప్రయాణికులతో స్నేహపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. సీఎం వెంటనే ప్రజలతో మమేకమవుతూ, పలువురితో సెల్ఫీలు దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా సీఎం చేసిన ఈ మెట్రో ప్రయాణం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజా రవాణా వినియోగంపై అవగాహన పెంచడమే కాకుండా, ప్రజలకు దగ్గరగా ఉండాలనే తన ఉద్దేశాన్ని రేఖా గుప్తా ఈ చర్య ద్వారా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మెట్రోలో ప్రయాణించడం పట్ల ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అనంతరం ఢిల్లీలో పేదల కోసం 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభించినట్లు సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఈ పథకానికి ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లను కేటాయించింది. ప్రతి అటల్ క్యాంటీన్లో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచనున్నారు. పేదలు, కూలీలు, కార్మికులకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే ఈ పథక లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
Today, 23 years ago, then Prime Minister Atal Bihari Vajpayee inaugurated the first Delhi Metro train between Shahdara and Tis Hazari.
Since then, that first train, TS#1, has covered more than 29 lakh kilometres and carried over 6 crore passengers.
On the 23rd anniversary of… pic.twitter.com/HenzPDKAEK
— Facts (@BefittingFacts) December 25, 2025