Site icon NTV Telugu

PM Modi: మోడీని కలిసిన సీఎం రేఖా గుప్తా

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కలిశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజుల తర్వాత రేఖ గుప్తా శనివారం మోడీని కలిశారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ను కూడా ముఖ్యమంత్రి కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది.

ఫిబ్రవరి 20న ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. తొలుత కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మకు సీఎం పోస్టు దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆర్‌ఎస్ఎస్‌తో మంచి సంబంధాలు ఉన్న కారణాన రేఖా గుప్తాకు అవకాశం దక్కింది.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: “అర్థం పర్థం లేని లెక్కలు”.. కేసీఆర్ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

ఇక రేఖా గుప్తాపై మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి విమర్శలు గుప్పించారు. మహిళలకు రూ.2,500 ఇస్తామన్న పథకం ఏమైంది? అని ప్రశ్నించారు. తొలి కేబినెట్ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు? కదా అని నిలదీశారు. అయితే ఒక్కరోజైనా గడవక ముందే అతిషి విమర్శలు చేస్తున్నారంటూ రేఖా గుప్తా తిప్పికొట్టారు. ఇక తాజాగా ఇదే అంశంపై రేఖా గుప్తాకు అతిషి లేఖ రాశారు. ఆదివారం ఆప్ ఎమ్మెల్యేలు కలిసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: Maruti Suzuki Ciaz: షాకింగ్.. మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు నిలిపివేత.. కారణం?

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓడిపోయారు.

Exit mobile version