Site icon NTV Telugu

Rekha Gupta: 5 టీవీలు, 14 ఏసీలు.. ఢిల్లీ సీఎం బంగ్లాకు ఎంత ఖర్చు చేస్తున్నారంటే..!

Rekha Gupta

Rekha Gupta

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక… ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్‌లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే బంగ్లా మరమ్మత్తుల కోసం రూ.60 లక్షలు కేటాయించబడ్డాయి. జూన్ 28న జారీ చేసిన టెండర్‌లో రూ.60 లక్షలు కేటాయించినట్లు వెల్లడైంది. ఇందులో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు ఏర్పాటు చేయనున్నారు.

ఇది కూడా చదవండి: GST: మధ్యతరగతికి గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం.. వీటి ధరలు తగ్గే అవకాశం..

పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) జారీ చేసిన టెండర్ నోటీసు ప్రకారం.. మరమ్మత్తు పనులు 60 రోజుల్లో పూర్తి కానున్నాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులు కూడా జరగనున్నాయి. ఇందుకోసం జూలై 4న టెండర్ కోసం బిడ్‌లు తెరవబడనున్నాయి. ముఖ్యమంత్రి రెండు బంగ్లాలు కేటాయించారు. నివాసం ఉండటానికి బంగ్లా నెంబర్ 1ను ఉపయోగించనున్నారు. బంగ్లా-2ను క్యాంప్ ఆఫీసుగా ఉపయోగించనున్నారు. రెండు బంగ్లాలో రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు ఏర్పాటు చేయనున్నారు. రూ.5.74 లక్షలతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే రూ.2లక్షల విలువైన నిరంతర విద్యుత్ సరఫరా కోసం యూపీఎస్ వ్యవస్థ ఉంటుంది.

ఇది కూడా చదవండి: Naga Vamsi : వార్2 తెలుగు స్టేట్స్ రిలీజ్.. నాగవంశీ విధ్వంసం

ఇక అదనంగా రూ.1.8లక్షలతో రిమోట్ కంట్రోల్‌తో కూడిన 23 సీలింగ్ ఫ్యానులు, రూ.85,000లతో ఓవెన్ టోస్ట్ గ్రిల్, రూ.77,000లతో ఒక ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్, రూ.60,000లతో డిష్‌వాషర్, రూ.63,000లతో గ్యాస్ స్టవ్, రూ.32,000లతో మైక్రోవేవ్‌లు, రూ.91,000లతో ఆరు గీజర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక రూ.6,03,939 వ్యయంతో ఇంట్లో మొత్తం 115 దీపాలు, వాల్ లైటర్లు, హ్యాంగింగ్ లైట్లు, మూడు పెద్ద షాండ్లియర్లు ఏర్పాటు చేయనున్నట్లు టెండర్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేఖా గుప్తా.. కేజ్రీవాల్ నివాసం ఉన్న 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని వివాదాస్పద బంగ్లాలో నివసించబోనని తేల్చి చెప్పారు. అది ‘‘శీష్‌మహల్‌’’ అంటూ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు. కోట్ల ఖర్చు చేసి విలాసవంతంగా నిర్మించారంటూ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు.

Exit mobile version