Site icon NTV Telugu

CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రికి హత్య బెదిరింపులు.. నిందితుడి కోసం గాలింపు..

Delhi Cm

Delhi Cm

CM Rekha Gupta: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాకు గురువారం రాత్రి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన కాల్‌లో రేఖ గుప్తాను చంపేస్తామని పేర్కొన్నారు. దీంతో ఘజియాబాద్ పోలీసులు వెంటనే ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే, రంగంలోకి దిగిన ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. కాగా, ఆ ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయడంతో దాని జాడ తెలియడం లేదు.

Read Also: Bomb Threat: వేలాది కసబ్‌లు పుట్టుకొస్తారు.. కర్ణాటక సీఎం, పాస్‌పోర్ట్ ఆఫీస్కి బాంబు బెదిరింపు..

అయితే, ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు హత్య బెదిరింపు కాల్ వచ్చిందన్నారు. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.. మరోవైపు, సీఎం రేఖ గుప్తా వంద రోజులకు పైగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత అధికారిక నివాసం కేటాయించబడిన కొన్ని గంటల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక, ఆమెకు కేటాయించిన ఈ నివాసం ఢిల్లీ నగరానికి సమీపంలో ఉంది. ఈ నివాసం ఆమె నియోజకవర్గంతో పాటు అధికారిక కార్యక్రమాలకు సులభంగా చేరుకోవడానికి ఈజీగా ఉంటుంది.

Exit mobile version