Site icon NTV Telugu

Arvind Kejriwal: ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ భేటీ

Aravind Kejrival

Aravind Kejrival

Arvind Kejriwal: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను మద్దతు కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన ఆయన నేడు ఎస్పీ అధినేత అఖిలేశ్‌తో సమావేశం కానున్నారు. ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల పోస్టింగ్‌, బ‌దిలీల‌పై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విప‌క్షాల మ‌ద్దతు కూడ‌గ‌ట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ రాష్ట్రాల్లో ప‌ర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో లక్నోలో భేటీ కానున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌తో కలిసి మద్దతు కోరనున్నారు.

Read also: Naga chaitanya : ఆ సూపర్ హిట్ సినిమా ను రీ మేక్ చేయబోతున్న నాగ చైతన్య..!!

ఢిల్లీలో బ్యూరోక్రాట్‌ల పోస్టింగ్‌, బ‌దిలీల‌పై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవడంలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివ‌సేన (యూబిటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌తో భేటీ అయి వారి మద్ధతు కోరిన విషయం తెలిసిందే. ఇపుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్‌తో సమావేశం నిర్వహించనున్నారు.

Read also: RITES Recruitment 2023: రైల్వేలో భారీగా ఉద్యోగాలు..నెలకు 1,40000 జీతం.. పూర్తి వివరాలు..

ఢిల్లీలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై ప్రజా ప్రభుత్వానికే పూర్తి అధికారం ఉంటుందని మే 11న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇచ్చింది. అయితే మే 19న మోదీ సర్కార్‌ ఆ తీర్పును తుంగలో తొక్కి ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్డినెన్స్‌ను రాజ్యసభలో అడ్డుకోవడానికి బీజేపీయేతర పార్టీల నాయకులను కేజ్రీవాల్‌ కలుస్తున్నారు. సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పునే అమలు చేయాలని.. కేంద్ర ఆర్డినెన్స్‌ మూలంగా ఎన్నికైన ప్రభుత్వాలకు బ్యూరోక్రాట్లపై అధికారులు లేకుండా పోతున్నాయని కేజ్రీవాల్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ఆర్డినెన్స్ ను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు.

Exit mobile version