Delhi Assembly elections 2025: ఢిల్లీ సీఎం ఆతిశీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు.. పీఏ రూ. 5 లక్షలతో పోలీసులకు చిక్కాడంటూ..

  • ఢిల్లీ సీఎం ఆతిశీపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
  • పీఏ రూ. 5 లక్షలతో పోలీసులకు చిక్కాడంటూ ఆరోపణ
  • ఆరోపించిన బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ
Athish

Athish

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ.. ఆప్, బీజేపీల మధ్య చోటుచేసుకుంటున్న ఆరోపణలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఢిల్లీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆమె పీఏ రూ. 5 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడంటూ బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. అతిశీ పీఏ గిరిఖండ్ నగర్ లో రూ. 5 లక్షలతో పోలీసులకు చిక్కాడంటూ బాంబ్ పేల్చాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైందని వెల్లడించాడు.

కల్కాజీలోని ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు పంచేందుకు కుట్ర జరుగుతోందని మాలవీయ తెలిపారు. కాగా ఆతిశీ ఆ నియోజక వర్గం నుంచే పోటీచేస్తుండడం గమనార్హం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరారు. ఢిల్లీలోని 70 స్థానాలకు మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది.