NTV Telugu Site icon

Atishi: సీఎం బంగ్లా మరోసారి రద్దు.. ప్రజల ఇళ్లల్లోనే ఉంటానన్న అతిషి

Cmatishi

Cmatishi

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. అయితే ఢిల్లీలో షెడ్యూల్‌కు ముందు నుంచే ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ప్రధాన పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.

ఇది కూడా చదవండి: Daaku Maharaaj: తెలంగాణలో టికెట్ రేట్ల హైక్ పై నాగ వంశీ కీలక ప్రకటన..

ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి అతిషి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన బంగ్లాను మరోసారి కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. మూడు నెలల కాలంలో ఇది రెండోసారని చెప్పారు. మంగళవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. బంగ్లా ఖాళీ చేయాలంటూ సోమవారం నోటీసులు వచ్చాయని తెలిపారు. బంగ్లా ఖాళీ చేయాలంటూ నోటీసులు పేర్కొన్నారని చెప్పారు. ఇక తన కుటుంబ సభ్యుల్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని.. తాను సీఎంగా ఎన్నికైన తర్వాత.. తన వస్తువులన్నింటినీ బీజేపీ కార్యకర్తలు బయటకు విసిరేశారని తెలిపారు. ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం పని చేయకుండా.. మా ఇండ్లు గుంజుకుంటున్నారని ఆరోపించారు. అవసరమైతే ఢిల్లీ ప్రజల ఇళ్లల్లో ఉండి వాళ్ల కోసం పని చేస్తానని అతిషి చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Borewell Incident: బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి మృతి.. 34 గంటల రెస్య్కూ విఫలం..

మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 శాసనసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇక 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. బీజేపీ తొలి విడతగా 29 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కాంగ్రెస్ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

 

Show comments