NTV Telugu Site icon

Viral News: మనసు దోచుకుంటున్న డ్రైవర్.. నెటిజన్లు ప్రశంసలు..

Delhi Cab Driver

Delhi Cab Driver

ఈరోజుల్లో బస్సులు కన్నా ప్రముఖ నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎక్కువ అవుతున్నాయి.. జనాలు కూడా ఎక్కువగా ప్రయాణాలకు క్యాబ్ లను వాడుతున్నారు.. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్యాబ్ లకు సంబందించిన యాప్ లను వాడుతున్నారు. యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి.. వీటన్నిటికి చెక్ పెట్టేలా ఓ క్యాబ్ డ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ అసాధారణ సేవా గుణం గురించి వింటే అందరి మనసులు చలించిపోతాయి. అతను ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఆలోచించే ఖదీర్ తన కారులో కొన్ని సౌకర్యాలు అమర్చాడు. కారులో స్నాక్స్, నీరు, పండ్ల రసాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన మెడికల్ కిట్ అన్నీ అమర్చుకున్నాడు. ఇవన్నీ ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నాడు. అంతేకాదు ప్రయాణీకుల సౌకర్యంతో పాటు.. పిల్లల సంక్షేమానికి సహకరించడానికి తన కారులో విరాళాల బాక్స్‌ను పెట్టాడు. ఇతని కారులో ప్రయాణించిన శ్యామ్‌లాల్ యాదవ్ అనే ప్రయాణికుడు తన అనుభవాలను క్యాబ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్ల మనసు దోచుకుంది.. దాంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది..ఉబెర్ డ్రైవర్ ఖదీర్ యొక్క నిస్వార్థ సేవను ప్రశంసించారు. ‘అదృష్టవశాత్తూ ఢిల్లీలో అతని క్యాబ్‌లో కూర్చునే అవకాశం నాకు కూడా లభించింది’ అని ఒకరు.. ‘మీరు మీ వృత్తిని ఇష్టపడినప్పుడే ఇలా ఉండగలుగుతారు’ అని మరొకరు కామెంట్లతో ప్రశంసలు కురిపించారు.. అతడి క్యాబ్ కోసం స్థానికులు వెయిట్ చేస్తారని చెబుతున్నారు.. తనకు వచ్చే జీవితంలో కొంత కుటుంబ పోషణకు పెడితే.. మరికొంత ఇలా ఖర్చు చెయ్యడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..