Site icon NTV Telugu

India – Pakistan War: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ కార్యకలాపాలు.. ప్రయాణికులకు కీలక సూచనలు..

Delhi Airport

Delhi Airport

India – Pakistan War: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం అయ్యాయి.. భారత్‌, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా భద్రతా సంసిద్ధత పెరిగిన నేపథ్యంలో ప్రయాణికులకు ఒక సలహా జారీ చేశారు.. ఢిల్లీ విమానాశ్రయ కార్యకలాపాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి. అయితే, మారుతున్న వైమానిక పరిస్థితులు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాల ప్రకారం పెరిగిన భద్రతా చర్యల కారణంగా, కొన్ని విమానాల షెడ్యూళ్ల ప్రభావం ఉండొచ్చు.. భద్రతా తనిఖీ ప్రాసెసింగ్ సమయాలు ఎక్కువ సమయం ఉండవచ్చు అని పేర్కొంది..

Read Also: India Pak War : భారత్‌లో 32 విమానాశ్రయాలు మూసివేత..

విమానాశ్రయ ఆపరేటర్.. ప్రయాణికులకు ఈ కీలక సూచనలు చేశారు.. మీరు ప్రయాణించే విమానయాన సంస్థల నుండి తాజా సమాచారం పొందండి. హ్యాండ్ బ్యాగేజ్ మరియు చెక్-ఇన్ లగేజ్ నియమాలను అనుసరించండి. భద్రతా తనిఖీల వద్ద సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్నందున.. ఆ జాప్యాన్ని అధిగమించడానికి ముందుగానే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోండి. భద్రతా తనిఖీలు, ప్రయాణం సజావుగా సాగేందుకు ఎయిర్‌లైల్స్‌ సిబ్బంది, భద్రతా సిబ్బందికి సహకరించండి. ఎయిర్‌లైన్ లేదా.. ఢిల్లీ విమానాశ్రయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విమాన స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది..

Read Also: Operation Sindoor: పాక్ వ్యాప్తంగా భారత్ విధ్వంసం.. ఎయిర్ స్పేస్ మూసివేత..

ఇక, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), సంబంధిత విమానయాన అధికారులు ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం విదితమే.. ఎయిర్‌మెన్ (NOTAMs)కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరిస్థితులను బట్టి ఇది అమల్లో ఉండనుంది.. 32 విమానాశ్రయాల జాబితాలో అధంపూర్, అంబాలా, అమృత్‌సర్, అవంతిపూర్, బతిండా, భుజ్, బికనీర్, చండీగఢ్, హల్వారా, హిండన్, జైసల్మేర్, జమ్మూ, జామ్‌నగర్, జోధ్‌పూర్, కాండ్లా, కాంగ్రా (గగ్గల్), కేశోడ్, కిషన్‌గఢ్, కులు మనాలి (భుంటార్), లేహ్, లూథియానా, ముంద్రా, నలియా, పఠాన్‌కోట్, పాటియాలా, పోర్బందర్, రాజ్‌కోట్ (హిరాసర్), సర్సావా, సిమ్లా, శ్రీనగర్, థోయిస్ మరియు ఉత్తర్‌లై ఉన్నాయి. పాకిస్తాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, ఉత్తరాన బారాముల్లా నుండి దక్షిణాన భుజ్ వరకు, అంతర్జాతీయ సరిహద్దు.. నియంత్రణ రేఖ (LOC) రెండింటిలోనూ 26 ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.. ఈ డ్రోన్లు ఆయుధాలు కలిగి ఉన్నాయని.. ప్రజలను, సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.

Exit mobile version