Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నేలరాలిన విద్యాకుసుమం
- 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. నీట్ పరీక్ష రద్దు మరొక విద్యార్థిని బలి తీసుకొంది. ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదు రోజుల్లో రీ-ఎగ్జామ్ జరగబోతున్న తరుణంలో డెహ్రాడూన్‌కు చెందిన 12వ తరగతి టాపర్ రియా కుమారి థాపా ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబంలో.. స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలుమున్నాయి.
23 ఏళ్ల రియా కుమారి థాపా ప్రతిభావంతురాలైన విద్యార్థిని. 97.6 శాతం మార్కులతో 12వ తరగతిలో ప్రథమ స్థానం సాధించింది. ట్యూషన్ చెప్పుకుంటూ తన ఖర్చులను తానే భరించుకుంది. 2026లో నీట్ పరీక్ష గురించి చాలా నమ్మకంగా ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని, తప్పకుండా పాస్ అవుతానని కుటుంబ సభ్యులకు చెప్పింది. కానీ హఠాత్తుగా ఆ పరీక్ష రద్దైంది. దీంతో అప్పటి నుంచి బెంగ పెట్టుకుంది. చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోయాయి.
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
అయితే చంద్రబానిలో రియా ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. ‘‘అమ్మా, నాన్నా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇందులో ఎవరిదీ తప్పు లేదు’’ అని రాసింది. తండ్రి కార్గిల్ యుద్ధంలో పోరాడగా.. తల్లి గృహిణి. రియా నీట్ పరీక్ష మొదటిసారి విఫలమైనప్పటికీ.. 2026లో జరగబోయే తన రెండో పరీక్షపై ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. తాను పరీక్షలో బాగా రాశానని.. తప్పకుండా పాస్ అవుతానని తన కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి చెప్పింది. కానీ ఆశలు ఆవిరైపోయాయి.
నివేదికల ప్రకారం.. రియా రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంది. కానీ ఉదయం ఆమె గది తలుపు తెరుచుకోకపోవడంతో ఆమె తల్లి తట్టింది. చాలా సేపటి వరకు తలుపు తెరుచుకోకపోవడంతో తండ్రిని పిలిచింది. తండ్రి తలుపు తెరిచి చూడగా రియా ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!