Heavy Rain Alert for AP: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, కాసేపట్లో పూరీ దగ్గర తీరం దాటనుంది తీవ్ర వాయుగుండం.. భూ ఉపరితలంపై ఇవాళ అర్ధరాత్రి వరకు తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ క్రమేపీ బలహీనపడుతుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, పార్వతి పురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామా రాజు, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.. ఇదే సమయంలో.. కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణ.. ఉభయ గోదావరి జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చింది.. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి.. చింతపల్లిలో 13 సెంటీమీటర్లు, పూసపాటి రేగ 10, వైజాగ్ ఎయిర్ పోర్ట్ 09 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం..
Read Also: Rajasthan : రూ.4కోట్ల విలువైన పాము విషాన్ని తరలిస్తుండగా ఐదుగురి అరెస్ట్