NTV Telugu Site icon

MK Stalin: “సింధూ నాగరికత”ను డీకోడ్ చేసిన వారికి రూ. 8.5 కోట్ల ప్రైజ్‌మనీ.. స్టాలిన్ ప్రకటన..

Mk Stalin

Mk Stalin

MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్‌ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.

చెన్నైలో జరిగిన సింధు నాగరికత సదస్సు శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తూ ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. ఒకప్పుడు విలసిల్లిన సింధు నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని, ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి పండితులు నేటికీ కృషి చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, చిక్కులను ప్రయత్నించే వ్యక్తులకు లేదా సంస్థలకు రూ. 8.5 కోట్ల బహుమతి అందించబడుతుందని ఆయన చెప్పారు.

Read Also: Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..

సింధు లోయ నాగరికత అత్యంత పురాతన పట్టణ నాగరికతత్లో ఒకటి. దాని పట్టణ ప్రణాళికలకు, లిపికి ప్రసిద్ధి చెందింది. ఈ నాగరికత క్షీణతకు సంబంధించిన రహస్యాల ఇప్పటికీ చరిత్రకారుల్ని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. 1924లో సర్ జాన్ మార్షల్ సింధు లోయ నాగరికతను కనుగొన్నారు. ఇది భారతదేశ చరిత్రకు మూలంగా ఉంది. ఆర్యన్, సంస్కృత ప్రభావాలను కలిగి ఉంది.

“ద్రావిడ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే ఎద్దుల చిహ్నాలు సింధు లోయ కళాఖండాలలో ప్రబలంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి, అయితే గుర్రపు వర్ణనలు ప్రస్ఫుటంగా లేవు. ఇంకా, తమిళనాడులోని శివకలై, ఆదిచనల్లూర్, మైలదుంపరై వంటి ప్రదేశాలలో చిహ్నాలు, శాసనాలు కనుగొనబడ్డాయి. సింధూ లోయతో 60 శాతం పోలికలు ఉన్నాయి, శాసనాలు 90 శాతం సారూప్యతను చూపుతున్నాయి” అని ఎంకే స్టాలిన్ చెప్పారు. తమిళనాడులో కనుగొన్న వస్తువులు సైంటిఫిక్ డేటింగ్, సింధులోయ నాగరికతతో సరిపోలుతుందని నిర్ధారించిందని, రెండు ప్రాంతాల భాగస్వామ్య సాంస్కృతిక మరియు చారిత్రక మూలాలను నొక్కి చెబుతుందని అన్నారు.

Show comments