Indus Valley Civilisation: ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికతల్లో ఒకటి ‘‘సింధులోయ నాగరికత’’. హరప్పా, మొహంజోదారో లాంటి గొప్ప పట్టణాలు 5000 ఏళ్లకు పూర్వమే ఉన్నాయి. వాయువ్య భారతదేశం, పాకిస్తాన్ లో ఈ నాగరికత సింధు నది వెంబడి ఏర్పడింది.
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్‌ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.