NTV Telugu Site icon

Dead Frog In Packet Of Chips: చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప..

Dead Frog Found In Packet Of Chips In Gujarat

Dead Frog Found In Packet Of Chips In Gujarat

Dead Frog In Packet Of Chips: డబ్బులు పెట్టి కొన్నా కూడా క్వాలిటీ లభించడం లేదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో నాణ్యత లోపించింది. ఇటీవల కాలంలో ఆహారంలో చనిపోయిన బొద్దింకలు, బల్లులు, ఎలుకలు కనిపించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ముంబైలో ఐస్‌క్రీమ్‌లో తెగిన వేలు కనిపించిన వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నాణ్యత పాటించకపోవడంతో కస్టమర్లు అస్వస్థతకు గురవ్వడం కొన్నిసార్లు ఫుడ్ ఫాయిజనింగ్‌తో చనిపోవడం జరుగుతోంది. సంఘటన జరిగిన సమయంలో హడావుడి చేసే అధికారులు, ఆ తర్వాత పట్టించుకోవడం లేదనే ప్రజలు ఆరోపిస్తున్నారు.

Read Also: Renuka Swami Murder:రేణుకాస్వామిని తన్నిన షూ విజయలక్ష్మి ఇంట్లో.. మూడు బైకులు సీజ్?

ఇదిలా ఉంటే తాజాగా చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. జామ్‌నగర్‌లో పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. బాలాజీ వేఫర్స్ తయారు చేసిన క్రంచెక్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించిందని జాస్మిన్ పటేల్ అనే వ్యక్తి తమకు ఫిర్యాదు చేశారని అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిజంగానే కుళ్లిపోయిన కప్ప కనిపించనట్లు విచారణలో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి డీబీ పర్మార్ తెలిపారు.

పుష్క్ ధామ్ సొసైటికి చెందిన పటేల్ తన మేనకోడళ్ల కోసం మంగళవారం సాయంత్రం సమీపంలోని దుకాణం నుంచి చిప్స్ ప్యాకెట్స్ కొనుగోలు చేశారు. కప్పను గుర్తించే కన్నా ముందు తన మేనకోడలు కొన్నింటిని తిన్నట్లుగా అతను చెప్పాడు. ముందుగా చెప్పినప్పుడు ఈ విషయాన్ని తాను నమ్మలేదని, ఆ తర్వాత బాలాజీ వేఫర్స్ డిస్ట్రబ్యూటర్స్, కస్టమర్ కేర్ సర్వీస్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు.