Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Day After Sonia Gandhi M Kharges Rally In Rajasthan Several Congress Leaders Join Bjp

Congress: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి భారీ షాక్.. సోనియా గాంధీ, ఖర్గే సభ మరుసటి రోజే బీజేపీలోకి వలసలు..

Published Date :April 7, 2024 , 9:27 pm
By Venu Goapl Reddy
Congress: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కి భారీ షాక్.. సోనియా గాంధీ, ఖర్గే సభ మరుసటి రోజే బీజేపీలోకి వలసలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగాజల్ మీల్, పీసీసీ ఉపాధ్యక్షుడు సుశీల్‌ శర్మ సహా పలువురు నేతలు పార్టీని వీడి ఆదివారం బీజేపీలో చేరారు. సూరత్ గఢ్ నంచి కాంగ్రెస్ తరుపున అసెంబ్లీకి పోటీ చేసిన హనుమాన్ మీల్, మాజీ పీసీసీ ఉపాధ్యక్షుడు అశోక్ అవస్తీలు బీజేపీ నాయకులు ఓంకార్ సింగ్ లఖావత్, నారాయణ్ పంచరియా మరియు అరుణ్ చతుర్వేది సమక్షంలో బిజెపిలో చేరారు.

Read Also: Chittoor Crime: మైనర్‌పై అత్యాచారం.. అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

వర్గపోరు కారణంగా అంకితభావంతో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల్లో నిరాశ నెలకొందని సుశీల్ శర్మ ఆరోపించారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం పనిచేశానని, అయితే ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్తల మాట వినేవారు లేరన్నారు. అయోధ్య రామమందిర విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా సనాతన ధర్మాన్ని విశ్వసించే తనలాంటి కార్యకర్తలు నిరాశకు గురయ్యారని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా తన సత్తా నిరూపించుకుందని, దీని ప్రభావంతో జాతీయవాద ఆలోచనతో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికల టికెట్ల విషయంలో పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా, మాజీ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మీల్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావాకు ఫిర్యాదు చేసినా కూడా వినలేదని చెప్పారు. జైపూర్‌లోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో పాటు, రిటైర్డ్ అధికారులతో సహా వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు బీజేపీలో చేరారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లోని లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19,26 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Lok Sabha elections-2024
  • Rajasthan
  • sonia gandhi

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions