దర్భంగా పేలుడు కేసులో కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ…సంచలన విషయాలను వెలికితీస్తున్నది. దర్భంగా పేలుడు కేసులో సూత్రధారి సలీమే అని తేల్చింది. యూపీ నుంచి ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చిన సలీమ్.. ఇమ్రాన్, నాసిర్‌లతో రోజుల తరబడి భేటీ అయ్యాడని బయటపెట్టింది. ఐఈడీ బాంబుల తయారీలో ఇమ్రాన్, నాసిర్‌కు శిక్షణ ఇచ్చిన సలీమ్… నడుస్తున్న ట్రైన్‌లో బాంబులు పేల్చాలని కుట్రలు చేశారని గుర్తించారు అధికారులు.
read also : గర్భిణీ స్త్రీలకు వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
దర్భంగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని రెండు బోగీలను పేల్చేయ్యాలని ప్లాన్ వేసింది ఈ గ్యాంగ్. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో హజీ సలీమ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్బాల్ ఖన్నా, హజీ సలీమ్ లు పెద్ద ఎత్తున్న నిధుల సేకరించారని.. పాకిస్తాన్ నుంచి నిధులు తెప్పించినట్టుగా గుర్తించింది ఎన్‌ఐఏ. కోడ్ భాషలో నాసిర్ సోదరులతో సలీమ్ మాట్లాడాడని.. కోడ్ భాషను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నది ఎన్‌ఐఏ.